News March 18, 2024
కరీంనగర్: జిల్లాలో నెత్తురోడుతున్న రహదారులు
ఉమ్మడి జిల్లాలో రహదారులు నిత్యం రోడ్డు ప్రమాదాలతో నిత్తురోడుతున్నాయి. రోజు ప్రమాదాలలో కొందరు గాయపడుతుండగా, మరికొందరు మరణిస్తున్నారు. శనివారం మెట్పల్లి వద్ద ముగ్గురు మహిళలను గుర్తు తెలియని వాహనం ఢీకొనగా గాయాలయ్యాయి. ఎల్లారెడ్డిపేట మండలంలో ఓ వ్యక్తి మరణించారు. ఆదివారం ఉదయం జగిత్యాల కోరుట్ల ప్రధాన రహదారిపై ఆగిఉన్న లారీని ద్విచక్ర వాహనం ఢీకొన్న ఘటనలో కొండగట్టుకు చెందిన ముగ్గురు వ్యక్తులు మరణించారు.
Similar News
News October 31, 2024
ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో నేటి టాప్ న్యూస్
@ వేములవాడ పోలీస్ స్టేషన్‌ను తనిఖీ చేసిన ఎస్పీ అఖిల్ మహాజన్.
@ రామడుగు మండలంలో చెరువులో దూకి వ్యక్తి ఆత్మహత్య.
@ మానకొండూరు మండలంలో కారు, అంబులెన్స్ ఢీ.. ఒకరికి గాయాలు.
@ మల్యాల మండలంలో గుర్తు తెలియని వాహనం ఢీకొని ఒకరి మృతి.
@ గొల్లపల్లి పోలీస్ స్టేషన్‌ను తనిఖీ చేసిన జగిత్యాల ఎస్పీ అశోక్ కుమార్.
News October 31, 2024
వేములవాడలో మహాలింగార్చన, ఏకాదశ రుద్రాభిషేకం
మాస శివరాత్రి సందర్భంగా రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ శ్రీ రాజేశ్వరి స్వామి వారికి మహన్యాస పూర్వక ఏకాదశ రుద్రాభిషేకం నిర్వహించారు. పరివార దేవతార్చనలు నిర్వహించారు. స్వామివారికి మహాలింగార్చన వేద పండితుల మంత్రోచ్ఛారణల మధ్య నిర్వహించారు. పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారు.
News October 30, 2024
ధర్మపురి లక్ష్మీనరసింహస్వామి ఆలయ ఆదాయ వివరాలు
జగిత్యాల జిల్లాలో ప్రసిద్ధ ధర్మపురి లక్ష్మీనరసింహస్వామి ఆలయానికి బుధవారం రూ.1,25,713 ఆదాయం సమకూరినట్లు ఆలయాధికారులు తెలిపారు. అందులో వివిధ కార్యక్రమాల టికెట్ల అమ్మకం ద్వారా రూ.67,791, ప్రసాదాల అమ్మకం ద్వారా రూ.40,700, అన్నదానం రూ.17,222 వచ్చినట్లు ఆలయ కార్య నిర్వాహణాధికారి సంకటాల శ్రీనివాస్ ప్రజలకు తెలియజేశారు.