News January 15, 2025
కర్ణాటక సీఎం: మార్చి తరువాత మార్పు?
CM సిద్ద రామయ్య త్వరలో తప్పుకుంటారని తెలుస్తోంది. మార్చిలో బడ్జెట్ అనంతరం DK శివకుమార్ CM పగ్గాలు చేపడతారని ప్రచారం జరుగుతోంది. పవర్ షేరింగ్ ఫార్ములా ప్రకారం బాధ్యతల బదిలీ జరగనుందని తెలిసింది. అందుకే సిద్ద రామయ్య ఎంపిక చేసిన మంత్రులు, MLAలతో ప్రత్యేకంగా సమావేశమవుతున్నారని సమాచారం. ఈ విషయమై పార్టీ నేతలు బహిరంగంగా మాట్లాడవద్దని అధిష్ఠానం ఇప్పటికే ఆదేశించింది.
Similar News
News January 15, 2025
సంక్రాంతి సెలవులు రేపే లాస్ట్
తెలంగాణలోని జూనియర్ కాలేజీలకు సంక్రాంతి సెలవులు రేపటితో ముగియనున్నాయి. వీటికి ఈనెల 11 నుంచి 16 వరకు ఇంటర్ బోర్డు హాలిడేస్ ఇచ్చింది. పండగ సెలవుల్లో ఎంజాయ్ చేస్తున్న విద్యార్థులు ఎల్లుండి నుంచి కాలేజీ బాట పట్టనున్నారు. ఇక రాష్ట్రంలోని స్కూళ్లకు 17 వరకు సెలవులు ఉన్నాయి. 18న పాఠశాలలు తిరిగి తెరుచుకుంటాయి. అటు ఏపీలోని స్కూళ్లకు 19 వరకు హాలిడేస్.
News January 15, 2025
మీరు గేమ్ నుంచి తీసేయొచ్చు.. కానీ నా వర్క్‌ను ఆపలేరు: పృథ్వీ షా
జాతీయ జట్టుతోపాటు దేశవాళీ టీమ్‌లో తనకు చోటు దక్కకపోవడంపై పృథ్వీ షా పరోక్షంగా స్పందించారు. ‘మీరు నన్ను గేమ్ నుంచి తీసేయొచ్చు. కానీ నా వర్క్‌ను మాత్రం ఆపలేరు’ అని ఇన్‌స్టా స్టోరీలో రాసుకొచ్చారు. ఫిట్నెస్ను మెరుగుపరుచుకునేందుకు అతను కొన్ని వారాలుగా మైదానం, జిమ్‌లో కసరత్తులు చేస్తున్నారు. ఐపీఎల్లో కూడా పృథ్వీని ఏ జట్టూ కొనుగోలు చేయని విషయం తెలిసిందే.
News January 15, 2025
నన్ను దేవుడే రక్షిస్తాడు: కేజ్రీవాల్
ఖలిస్థానీ వేర్పాటువాదుల నుంచి ప్రాణహాని ఉందన్న వార్తలపై కేజ్రీవాల్ స్పందించారు. దేవుడే తనను రక్షిస్తాడని, దేవుడు అనుమతించినంత కాలం జీవిస్తానని పేర్కొన్నారు. దేవుడే రక్షించే వారిని ఎవరూ ఏమీ చేయలేరని వ్యాఖ్యానించారు. కేజ్రీవాల్ లక్ష్యంగా ఖలిస్థానీ మద్దతుదారుల హిట్ స్క్వాడ్ ఏర్పడిందని, ఢిల్లీ ఎన్నికల్లో వారు కేజ్రీవాల్‌ను టార్గెట్ చేసుకున్నట్టు నిఘా వర్గాలు హెచ్చరించాయి.