News July 12, 2024

ED అదుపులోకి కర్ణాటక కాంగ్రెస్ MLA

image

వాల్మీకి కార్పొరేషన్ స్కాం కేసులో మనీలాండరింగ్‌ ఆరోపణలతో కర్ణాటక మాజీ మంత్రి, కాంగ్రెస్ MLA నాగేంద్రను ED అదుపులోకి తీసుకుంది. ఆయన షెడ్యూల్ తెగల సంక్షేమశాఖ మంత్రిగా ఉన్న సమయంలో భారీ స్కామ్‌కు పాల్పడినట్లు ఆరోపణలున్నాయి. ఇటీవల ఆత్మహత్యకు పాల్పడిన ఈ శాఖ అకౌంట్స్ సూపరింటెండెంట్‌ చంద్రశేఖర్ సూసైడ్ లెటర్‌లో పలువురి పేర్లు రాసిన విషయం తెలిసిందే. అప్పుడే నాగేంద్ర తన మంత్రి పదవికి రాజీనామా చేశారు.

Similar News

News February 20, 2026

రూ.10 కోట్లు ఇవ్వు.. రణ్‌వీర్ సింగ్‌కు బిష్ణోయ్ గ్యాంగ్ నుంచి బెదిరింపు

image

బాలీవుడ్ స్టార్ హీరో రణ్‌వీర్ సింగ్‌కు బెదిరింపులు వచ్చాయి. రూ.10 కోట్లు ఇవ్వాలని లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్‌కు చెందిన హ్యారీ బాక్సర్ రణ్‌వీర్ మేనేజర్ వాట్సాప్ నంబర్‌కు వాయిస్ నోట్ పంపాడని NDTV పేర్కొంది. దీనిపై ముంబై క్రైం బ్రాంచ్ పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. అమెరికాలోని ఆ నంబర్, మరింత సమాచారం కోసం అమెరికా పోలీసులతో సంప్రదింపులు ప్రారంభించారు. ముందు జాగ్రత్తగా హీరోకు భద్రతను పెంచనున్నారు.

News February 20, 2026

నేషనల్ ఏరోస్పేస్ లాబోరేటరీస్‌లో ఉద్యోగాలు

image

బెంగళూరులోని <>నేషనల్<<>> ఏరోస్పేస్ లాబోరేటరీస్ 5 పోస్టులను భర్తీ చేయనుంది. అర్హతగల అభ్యర్థులు ఫిబ్రవరి 25, 26 తేదీల్లో ఇంటర్వ్యూకు హాజరుకావచ్చు. పోస్టును బట్టి BE/BTech(ఎలక్ట్రానిక్స్ &కమ్యూనికేషన్, మెటలర్జికల్ ఇంజినీరింగ్, మెటీరియల్ సైన్స్&ఇంజినీరింగ్, EEE)అర్హతతో పాటు పని అనుభవం ఉండాలి. అభ్యర్థుల గరిష్ఠ వయసు 35ఏళ్లు. వెబ్‌సైట్: https://www.nal.res.in

News February 20, 2026

పురుగు మందులను కొంటున్నారా?

image

పంటల్లో చీడపీడల నివారణకు పురుగు మందులను కొనేటప్పుడు తప్పకుండా నిపుణుల సలహా తీసుకోండి. ఒకే మందు పొడి మందుగాను, నీటిలో కరిగే ద్రావణంగాను, గుళికల రూపంలో లభ్యమౌతుంటే.. అవసరాన్ని బట్టి అంటే ఆశించిన పురుగు లేక తెగులును బట్టి, పంట దశ, నీటి లభ్యత, సమస్య తీవ్రతను అనుసరించి నిపుణుల సూచనతో మందును కొనాలి. షాపు యజమాని నుంచి రసీదును తప్పక తీసుకోవాలి. కొనేమందు పురుగుల మందు డబ్బా గడువు తేదీని చూసి తీసుకోవాలి.