News October 28, 2025
కర్ణాటక ప్రభుత్వానికి హైకోర్టులో ఎదురుదెబ్బ

ప్రైవేట్ సంస్థలు ప్రభుత్వ స్థలాల్లో మీటింగ్స్ పెట్టుకోవడానికి ముందు పర్మిషన్ తీసుకోవాలంటూ కర్ణాటక ప్రభుత్వమిచ్చిన ఆర్డర్స్‌పై ఆ రాష్ట్ర హైకోర్టు స్టే ఇచ్చింది. ఇది ప్రాథమిక హక్కులకు విరుద్ధమని, దీని వల్ల పది మంది పార్కులో పార్టీ చేసుకున్నా నేరమే అవుతుందని పిటిషనర్ తరఫు లాయర్ వాదించారు. కోర్టు విచారణను NOV 17కు వాయిదా వేసింది. కాగా RSSను కట్టడి చేసేందుకే ప్రభుత్వం ఈ ఆర్డరిచ్చిందని విమర్శలొచ్చాయి.
Similar News
News October 28, 2025
తుఫాను ప్రభావం.. భీకర గాలులు

AP: మొంథా తుఫాను దృష్ట్యా పలు జిల్లాల్లో భీకర గాలులు వీస్తున్నాయి. కోనసీమ, విశాఖ, కాకినాడ జిల్లాల్లో చెట్లు విరిగిపడ్డాయి. తీరం దాటే సమయంలో గంటకు 90-110 KM వేగంతో గాలులు వీస్తాయని అధికారులు వెల్లడించారు. ప్రస్తుతం *మచిలీపట్నం- 93 km/h *కాకినాడ- 82 km/h *విశాఖ- 68 km/h *రాజమండ్రి ఎయిర్‌పోర్ట్- 65 km/h *గంగవరం పోర్ట్- 58 km/h *చింతపల్లి- 55 km/h *బద్వేల్ (కడప)- 52 km/h వేగంతో గాలులు వీస్తున్నాయి.
News October 28, 2025
పూజ గదిలో ఈ విగ్రహాలు ఉండకూడదు: పండితులు

పూజ గదిలో శనిదేవుడు, రాహువు, కేతువుల ఫొటోలు/విగ్రహాలు పెట్టకూడదని పండితులు సూచిస్తున్నారు. వీటిని ఉంచడం వల్ల ఇంట్లో అశాంతి, ప్రతికూల శక్తి పెరిగే అవకాశాలు ఉంటాయంటున్నారు. ‘ఉగ్ర రూపాలైన కాలభైరవ, మహంకాళి ఫొటోలను కూడా ఇంట్లో పెట్టడం శుభకరం కాదు. పూజ గదిలో తినకపోవడం, నిద్రించకపోవడం ఉత్తమం. తడి జుట్టుతో ఆ గదిలోకి వెళ్లడం మంచిది కాదు’ అంటున్నారు. ✍️ మరిన్ని ఆధ్యాత్మిక కథనాల కోసం <<-se_10013>>భక్తి<<>> కేటగిరీ.
News October 28, 2025
షమీ ఆన్ ఫైర్.. జాతీయ జట్టులో చోటు దక్కేనా?

రంజీ ట్రోఫీలో బెంగాల్ తరఫున ఆడుతున్న షమీ జాతీయ జట్టులో చోటే లక్ష్యంగా చెలరేగుతున్నారు. 2 మ్యాచ్‌ల్లో 68 ఓవర్లు వేసి 15 వికెట్లు పడగొట్టారు. తన ఫిట్‌నెస్, ఫైర్ తగ్గలేదని నిరూపించారు. NOV 14 నుంచి స్వదేశంలో సౌతాఫ్రికాతో టెస్టు సిరీస్ జరగనున్న నేపథ్యంలో అగార్కర్, గంభీర్‌కు బిగ్ మెసేజ్ పంపారు. ఫిట్‌నెస్ లేదని WIతో టెస్టులకు, AUSతో వన్డే సిరీస్‌కు షమీని ఎంపిక చేయలేదు. ఇప్పుడేం చేస్తారో చూడాలి.


