News October 31, 2024
‘ఫ్రీ బస్’పై కర్ణాటక సర్కార్ పునరాలోచన!
కర్ణాటక ప్రభుత్వం శక్తి స్కీమ్‌లో భాగంగా అక్కడి మహిళలకు ఉచితంగా ఆర్టీసీ ప్రయాణ సదుపాయం కల్పించిన విషయం తెలిసిందే. అయితే దీనిపై పునరాలోచిస్తున్నట్లు డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ అన్నారు. రాష్ట్రంలోని మహిళలు డబ్బు చెల్లించి ప్రయాణించేందుకు ఆసక్తి చూపిస్తున్నారని ఆయన వెల్లడించారు. సోషల్ మీడియా, ఈమెయిల్స్ ద్వారా ఈ విషయాన్ని మహిళలు ప్రభుత్వానికి తెలియజేస్తున్నారని ఆయన వివరించారు.
Similar News
News October 31, 2024
‘ఇంతకు మించి’.. చైనా సమస్యపై రాజ్‌నాథ్ కీలక వ్యాఖ్యలు
LAC వద్ద భారత్, చైనా సైనికుల ఉపసంహరణ దాదాపుగా ముగిసిందని రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ తెలిపారు. డ్రాగన్ కంట్రీతో ‘ఇంతకు మించి’ పరిష్కారాలను కోరుకుంటున్నామని, అందుకు కాస్త సమయం పడుతుందని వెల్లడించారు. అరుణాచల్‌లోని తవాంగ్‌లో ఆయన సర్దార్ పటేల్ జయంతి, దీపావళిని సైనికులతో కలిసి జరుపుకున్నారు. మేజర్ బాబ్ ఖాథింగ్ శౌర్య మ్యూజియాన్ని ఆరంభించారు. ఈశాన్య భారతం భద్రతకు ఆయనెంతగానో కృషి చేశారని గుర్తుచేశారు.
News October 31, 2024
భారీ నష్టాలు.. రూ.3లక్షల కోట్లు లాస్!
దేశీయ స్టాక్ మార్కెట్లు భారీ నష్టాల్లో కొనసాగుతున్నాయి. దీపావళికి రాకెట్లలా దూసుకుపోతాయనుకుంటే తోకపటాకులా తుస్సుమనడం ఇన్వెస్టర్లను నిరాశపరిచింది. మధ్యాహ్నం ఒంటిగంటకు బీఎస్ఈ సెన్సెక్స్ 523 పాయింట్లు పతనమై 79,420, ఎన్ఎస్ఈ నిఫ్టీ 137 పాయింట్ల నష్టంతో 24,203 వద్ద ట్రేడవుతున్నాయి. దీంతో రూ.3లక్షల కోట్ల సంపద ఆవిరైంది. IT స్టాక్స్ ఘోరంగా క్రాష్ అవుతున్నాయి. TECHM, HCLTECH, INFY, TCS 3%మేర నష్టపోయాయి.
News October 31, 2024
టీజర్ రాకపోయేసరికి.. మెగా ఫ్యాన్స్ నిరాశ
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్-డైరెక్టర్ శంకర్ కాంబోలో తెరకెక్కుతున్న మూవీ ‘గేమ్ ఛేంజర్’ మేకర్స్‌పై విమర్శలు వస్తున్నాయి. ఈరోజు మ.12.06గంటలకు టీజర్ రిలీజ్ చేస్తామని ఉదయం చెప్పి తీరా సమయానికి ఇంకాస్త సమయం కావాలని ట్వీట్ చేశారు. దీంతో నిరాశకు గురైన కొందరు ఫ్యాన్స్ ‘గేమ్ ఛేంజర్’ కాదు ‘డేట్ ఛేంజర్’ అని సెటైర్లు వేస్తున్నారు. లేటైనా ఫర్వాలేదు బెస్ట్ క్వాలిటీ ఇవ్వాలని మరికొందరు కోరుతున్నారు.