News September 27, 2024
కర్ణాటక.. అడగ్గానే కుంకీ ఏనుగులను ఇచ్చింది: పవన్

AP: అడగ్గానే 8 కుంకీ ఏనుగులను కర్ణాటక ప్రభుత్వం ఇచ్చిందని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తెలిపారు. విజయవాడలో ఆయన మాట్లాడారు. ‘ఏనుగుల దాడులను ఎదుర్కొనే సమర్థత కర్ణాటకకు ఉందని తెలిసింది. వెంటనే అక్కడి ప్రభుత్వాన్ని సంప్రదించి కుంకీ ఏనుగులు కావాలని కోరాం. వెంటనే స్పందించి వాటిని అందజేసింది. చిత్తూరు, మన్యం, శ్రీకాకుళం జిల్లాలకు వీటిని తరలించి ఏనుగుల దాడిని అరికడతాం’ అని ఆయన వ్యాఖ్యానించారు.
Similar News
News November 17, 2025
గంభీర్ వల్లే ఓడిపోయాం.. నెటిజన్ల ఫైర్

నిన్న సౌతాఫ్రికా చేతిలో టీమ్ ఇండియా ఓటమికి హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ తప్పులే కారణమని నెటిజన్లు మండిపడుతున్నారు. బ్యాటింగ్ ఆర్డర్లో పదేపదే ఎందుకు మార్పులు చేస్తున్నారని ప్రశ్నిస్తున్నారు. స్పెషలిస్టు బ్యాటర్ సాయి సుదర్శన్‌ను ఆడించకుండా నలుగురు స్పిన్నర్లు ఎందుకని నిలదీస్తున్నారు. గతేడాది NZతో వైట్‌వాష్ అయినా పాఠాలు నేర్వకుండా మళ్లీ స్పిన్ పిచ్లే ఎందుకు తయారుచేశారని ప్రశ్నిస్తున్నారు.
News November 17, 2025
ఒకేసారి రెండు సీక్వెల్స్‌లో తేజా సజ్జ!

హనుమాన్, మిరాయ్ సినిమాలతో పాన్ ఇండియా హీరోగా మారిన తేజా సజ్జ మరో 2 చిత్రాలను లైన్లో పెట్టారు. జాంబిరెడ్డి, మిరాయ్ మూవీల సీక్వెల్స్‌ను సమాంతరంగా పూర్తిచేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఈ ప్రాజెక్టుల ప్రీప్రొడక్షన్ పనులు పూర్తయినట్లు సమాచారం. జనవరిలో జాంబిరెడ్డి-2, మార్చిలో మిరాయ్-2ను సెట్స్‌పైకి తీసుకెళ్తారని టాక్. ఈ సినిమాలను పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మించనుంది.
News November 17, 2025
ఏపీలో అణువిద్యుత్ ప్రాజెక్ట్.. పరిశీలిస్తున్న NTPC!

విద్యుదుత్పత్తి సంస్థ NTPC 700, 1000, 1,600 మెగావాట్ల కెపాసిటీతో అణువిద్యుత్ ప్రాజెక్టుల ఏర్పాటుకు సిద్ధమవుతోంది. ఇందుకోసం AP, గుజరాత్, మధ్యప్రదేశ్, బిహార్ రాష్ట్రాల్లో అనువైన ప్రదేశాలను అన్వేషిస్తున్నట్లు సంస్థ అధికారి ఒకరు వెల్లడించారు. 2047 నాటికి 30K మె.వా. విద్యుత్ ఉత్పత్తి సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు. వెయ్యి మెగావాట్ల ప్లాంట్‌కు రూ.20వేల కోట్ల వరకు ఖర్చవుతుందని అంచనా.


