News April 9, 2025

మహిళలకు కర్ణాటక మంత్రి క్షమాపణలు

image

బెంగళూరులో ఇద్దరు మహిళల పట్ల ఓ దుండగుడు అసభ్యంగా ప్రవర్తించిన ఘటనలో కర్ణాటక హోంమంత్రి పరమేశ్వర ‘నగరాల్లో మహిళలపై లైంగిక దాడులు సాధారణమే’ అన్న సంగతి తెలిసిందే. ఆ వ్యాఖ్యలపై ఆయన విచారం వ్యక్తం చేశారు. ‘నా మాటల్ని తప్పుగా అర్థం చేసుకున్నారు. కొంతమంది వాటిని వక్రీకరించారు. నా వ్యాఖ్యల వల్ల బాధపడిన మహిళలు నన్ను క్షమించండి. స్త్రీల రక్షణకే నేనెప్పుడూ అధిక ప్రాధాన్యాన్ని ఇస్తాను’ అని వివరణ ఇచ్చారు.

Similar News

News April 17, 2025

వారికి గౌరవ వేతనం పెంపు: మంత్రి ఫరూఖ్

image

ఏపీలో ప్రత్యేక మెజిస్ట్రేట్ల గౌరవ వేతనం పెంపునకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది. గౌరవ వేతనం రూ.45,000, రవాణా సౌకర్యాలకు మరో రూ.5వేలు ఇవ్వనున్నట్లు పేర్కొంది. 2019 ఏప్రిల్ 1 నుంచే ఇది వర్తిస్తుందని మంత్రి ఫరూక్ తెలిపారు.

News April 17, 2025

గిట్టుబాటు ధర లేదు.. ఉపాధి కూలీలకు డబ్బు చెల్లించట్లేదు: బొత్స

image

AP: కూటమి నేతల మాటలకు, చేతలకు పొంతన లేదని మండలిలో ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ విమర్శించారు. అధికార పార్టీ నేతలు డబ్బు డిమాండ్ చేస్తుండటంతో పరిశ్రమలు వెనక్కిపోతున్నాయని ఆరోపించారు. గిట్టుబాటు ధర లేక మిర్చి రైతులు అల్లాడిపోతున్నారని, ఉపాధి కూలీలకూ డబ్బులు చెల్లించట్లేదని ఫైరయ్యారు. 10 నెలల్లో ఒక్కరికైనా కొత్తగా పెన్షన్ ఇచ్చారా? అని నిలదీశారు. హామీలపై ప్రశ్నిస్తే కేసులు పెడుతున్నారని మండిపడ్డారు.

News April 17, 2025

ఈ నెల 24న OTTలోకి ‘L2: ఎంపురాన్’

image

పృథ్వీరాజ్ సుకుమారన్ స్వీయ దర్శకత్వంలో మోహన్ లాల్ హీరోగా తెరకెక్కిన ‘L2: ఎంపురాన్’ మూవీ ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్సయ్యింది. ఈ నెల 24 నుంచి మలయాళ, తెలుగు, తమిళ, కన్నడ భాషల్లో జియో హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ కానుంది. మార్చి 27న థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం దాదాపు రూ.270 కోట్ల కలెక్షన్లు సాధించి సూపర్ హిట్‌గా నిలిచింది. అలాగే మలయాళంలో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా రికార్డు సృష్టించింది.

error: Content is protected !!