News June 7, 2024

అవినీతి ఆరోపణలతో కర్ణాటక మంత్రి రాజీనామా

image

మనీలాండరింగ్ ఆరోపణలతో కర్ణాటక మంత్రి బి.నాగేంద్ర తన పదవికి రాజీనామా చేశారు. రాజీనామా లేఖను సీఎం సిద్దరామయ్యకు సమర్పించగా, ఆయన దాన్ని గవర్నర్‌కు పంపించారు. నిధుల దుర్వినియోగానికి తమను సీనియర్ అధికారులు ఒత్తిడి చేస్తున్నారని KMVSTDC బోర్డు సూపరింటెండెంట్ చంద్రశేఖర్ సూసైడ్ నోట్ రాసి మే 26న ఆత్మహత్య చేసుకున్నారు. దీంతో ఆ శాఖ మంత్రి బి.నాగేంద్రపై మనీలాండరింగ్ ఆరోపణలు మొదలయ్యాయి.

Similar News

News January 19, 2026

PPP విధానంలో ఆర్టీసీ బస్టాండ్ల అభివృద్ధి

image

AP: రాష్ట్రంలోని ప్రధాన RTC బస్టాండ్లను PPP విధానంలో ₹958 కోట్లతో అభివృద్ధి చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఆటోనగర్ (విజయవాడ), గుంటూరు, కర్నూలు, మద్దిలపాలెం (విశాఖ), చిత్తూరు బస్టాండ్ల విస్తరణ, ఆధునికీకరణ చేయనున్నారు. తిరుపతి బస్టాండ్ అభివృద్ధి పనులు కేంద్ర సహకారంతో ఇప్పటికే ప్రారంభం అయ్యాయని అధికారవర్గాలు పేర్కొంటున్నాయి. కాగా ప్రైవేటు సంస్థలు ముందుకు రాగానే ఇతర బస్టాండ్ల పనులూ చేపడతారు.

News January 19, 2026

చిన్న గ్రామం.. 100 మంది డాక్టర్లు

image

ఒక చిన్న గ్రామం దేశానికి 100 మంది డాక్టర్లను అందించింది. బిహార్ పాట్నాకు 55KMల దూరంలోని అమ్హారా గ్రామం ‘విలేజ్ ఆఫ్ డాక్టర్స్’గా పేరుపొందింది. సమాజ సేవ కోసమే ఇక్కడ చాలామంది డాక్టర్ చదువుతున్నారు. ఈ గ్రామానికి చెందిన సీనియర్ డాక్టర్లు రెగ్యులర్‌గా హెల్త్ క్యాంపులు నిర్వహిస్తారు. విద్యార్థులకు సలహాలు, సూచనలు ఇస్తారు. వారిని ఆదర్శంగా తీసుకుని గ్రామంలో మరింతమంది మెడిసిన్ చదవడానికి ఆసక్తి చూపుతున్నారు.

News January 19, 2026

5 రోజుల్లో రూ.100 కోట్ల కలెక్షన్లు

image

నవీన్ పొలిశెట్టి, మీనాక్షి చౌదరి కాంబినేషన్లో తెరకెక్కిన ‘అనగనగా ఒక రాజు’ కలెక్షన్ల సునామీ సృష్టిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా రూ.100 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్లు రాబట్టినట్లు నిర్మాణ సంస్థ సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ ప్రకటించింది. విడుదలైన 5 రోజుల్లోనే ఈ ఘనత అందుకుందని ట్వీట్ చేసింది. కాగా నవీన్ కెరీర్‌లో ఇదే తొలి రూ.100 కోట్ల మార్క్ మూవీ కావడం విశేషం.