News October 9, 2025
మహిళా ఉద్యోగులకు నెలసరి సెలవు

కర్ణాటక కాంగ్రెస్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని మహిళా ఉద్యోగులకు నెలసరి సెలవు ఇచ్చేందుకు నిర్ణయించింది. ప్రభుత్వ కార్యాలయాలు, గార్మెంట్ ఇండస్ట్రీస్, మల్టీనేషనల్ కంపెనీలు, IT సంస్థలు, ఇతర ప్రైవేట్ ఆర్గనైజేషన్స్‌లో నెలకొక పెయిడ్ లీవ్ చొప్పున ఇవ్వాలని వెల్లడించింది. మహిళల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని వారిని ప్రోత్సహించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది.
Similar News
News October 9, 2025
సిల్వర్.. ధరలు చూస్తే ఫీవర్!

అందరూ బంగారం గురించే మాట్లాడుకుంటున్నారనో ఏమో <<17959732>>వెండి<<>> తన కోపాన్ని ధరలపై చూపిస్తున్నట్లుంది. కిలోపై వందో రెండొందలు పెరిగితే లైట్ తీసుకుంటున్నారని ఏకంగా రూ.వేలల్లో పెరుగుతోంది. దీంతో బంగారమే కాదు వెండిని సైతం కొనలేని పరిస్థితి నెలకొంది. గతేడాది కిలో రూ.లక్షకు చేరువైతేనే వామ్మో అనుకునేలోపే రూ.2లక్షల వైపు దూసుకెళ్తోంది. దీంతో సామాన్యుల కొనుగోళ్లు మందగించగా, కొందరు సిల్వర్‌లో పెట్టుబడులు పెడుతున్నారు.
News October 9, 2025
జనవరిలో డీఎస్సీ నోటిఫికేషన్!

AP: వచ్చే జనవరిలో డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్లు విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ తెలిపారు. నవంబర్ చివర్లో టెట్ నోటిఫికేషన్ రిలీజ్ చేస్తామని వెల్లడించారు. ఏటా డీఎస్సీ నిర్వహిస్తామనే మాటకు కట్టుబడి ఉన్నట్లు స్పష్టం చేశారు. మార్చిలో డీఎస్సీ, స్పెషల్ డీఎస్సీ పరీక్షలు నిర్వహించనున్నట్లు చెప్పారు. అభ్యర్థులు తమ చదువును కంటిన్యూ చేస్తే తప్పకుండా విజయం సాధించవచ్చు.
News October 9, 2025
బీజేపీ అంతర్గత చర్చకు నాకు సంబంధం లేదు: బొంతు

TG: తనను బీజేపీ అభ్యర్థిగా <<17960394>>ప్రతిపాదించిన<<>> విషయంపై పీసీసీ ఉపాధ్యక్షుడు బొంతు రామ్మోహన్ స్పందించారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో బీజేపీ నుంచి పోటీ చేస్తానన్న మాటల్లో వాస్తవం లేదన్నారు. తన అభ్యర్థిత్వంపై కాషాయ పార్టీలో అంతర్గత చర్చకు తనకు ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. ‘నేను కాంగ్రెస్‌లోనే ఉన్నా.. ఉంటాను కూడా. ఇక్కడ సంతృప్తిగా ఉన్నాను’ అని ప్రకటన విడుదల చేశారు.