News July 19, 2024
కర్ణాటక రిజర్వేషన్ బిల్లు అవివేకం: శశి థరూర్
ప్రైవేటు సంస్థల్లో స్థానికులకు రిజర్వేషన్లు కల్పించాలని కర్ణాటకలోని కాంగ్రెస్ ప్రభుత్వం ఆలోచించడం అవివేకమని ఆ పార్టీ MP శశి థరూర్ అభిప్రాయపడ్డారు. అన్ని రాష్ట్రాలూ ఇలాగే స్థానికులకు రిజర్వేషన్లు కల్పిస్తే అది రాజ్యాంగ విరుద్ధమవుతుందన్నారు. ప్రతి పౌరుడు దేశంలో నచ్చిన చోట నివసిస్తూ, పని చేసే హక్కు రాజ్యాంగం కల్పించిందని గుర్తు చేశారు. కాగా ప్రభుత్వం బిల్లును హోల్డ్‌లో పెట్టడాన్ని ఆయన అభినందించారు.
Similar News
News January 24, 2025
నాన్నకు కొడుకిచ్చే బెస్ట్ సర్ప్రైస్ ఇదే కావొచ్చు❤️!
నాన్న త్యాగాలకు వెలకట్టలేం. తన త్యాగాలకు తగిన ప్రతిఫలం కావాలని ఏ తండ్రీ ఆశించరు. ఆయన కష్టాన్ని గౌరవించాల్సిన బాధ్యతైతే పిల్లలదే. ఆర్యన్ మిశ్రా అదే చేశారు. 25 ఏళ్ల క్రితం తండ్రి వాచ్‌మన్‌గా పనిచేసిన ఢిల్లీ ITC మౌర్యలో ఫ్యామిలీతో డిన్నర్‌కు తీసుకెళ్లి సర్ప్రైజ్ ఇచ్చారు. దీనిని SMలో షేర్ చేయడంతో నైస్, బాగుంది, పేరెంట్స్‌ను ప్రేమించాలి. పిల్లలకోసం వారెన్నో త్యాగాలు చేస్తారని నెటిజన్లు అంటున్నారు.
News January 24, 2025
రాజకీయాలకు గుడ్ బై: విజయసాయిరెడ్డి
AP: రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్లు వైసీపీ నేత, వైఎస్ జగన్ సన్నిహితుడు విజయసాయి రెడ్డి ట్వీట్ చేశారు. రేపు రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేస్తానని పేర్కొన్నారు. ఇది పూర్తిగా వ్యక్తిగత నిర్ణయమని, ఏ పార్టీలోనూ చేరడం లేదని తెలిపారు. జగన్‌కు మంచి జరగాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. చంద్రబాబుతో ఎలాంటి వ్యక్తిగత విభేదాలు లేవన్నారు. పవన్‌తో చిరకాల స్నేహం ఉందని, భవిష్యత్తు వ్యవసాయం అంటూ రాసుకొచ్చారు.
News January 24, 2025
BSNL కస్టమర్లకు గుడ్‌న్యూస్
ప్రభుత్వ రంగ టెలికం దిగ్గజం BSNL కొత్త కస్టమర్లను ఆకర్షించేందుకు సిద్ధమైంది. ఈక్రమంలో దేశంలో 65వేలు+ 4G టవర్లను ఏర్పాటు చేసింది. అందులో 2వేల కంటే ఎక్కువ టవర్లు తెలంగాణ వ్యాప్తంగా ఉన్నట్లు సంస్థ ప్రకటించింది. హైదరాబాద్‌లో 675, రంగారెడ్డిలో 100, మెదక్‌లో 158, నల్గొండలో 202, మహబూబ్‌నగర్‌లో 151, ఆదిలాబాద్‌లో 141, నిజామాబాద్‌లో 113, కరీంనగర్లో 98, వరంగల్‌లో 231, ఖమ్మంలో 219 టవర్స్ ఏర్పాటు చేశామంది.