News December 6, 2024

‘కర్ణాటకం’ మళ్లీ మొదలు: CM కుర్చీ కోసం DK, సిద్దూ కుంపట్లు!

image

కర్ణాటక కాంగ్రెస్‌లో అంతర్గత పోరు ముదురుతోంది. ‘పార్టీకోసం ఎంతో శ్రమించారు. జీవితాంతం DCMగానే ఉంటారా?’ అని ఓ ఛానల్ అడిగిన ప్రశ్నకు DK శివకుమార్ ‘జీవితాంతం కాదు. మా మధ్య ఓ అవగాహన ఉంది. అదిప్పుడు చర్చించలేను’ అని తెలిపారు. 50:50 ప్రాతిపదికన సిద్దరామయ్యతో ఒప్పందంపై ఆయన పరోక్షంగా సంకేతాలిచ్చారు. దీనిని సిద్దూ ఖండించారు. అలాంటి ఒప్పందాలుంటే ఇక పార్టీలో మేమెందుకంటూ HM పరమేశ్వర మధ్యలో దూరడం విశేషం.

Similar News

News October 22, 2025

నేటి నుంచి కార్తీక వైభవం

image

శివకేశవులకు ప్రీతికరమైన కార్తీక మాసం నేడు ప్రారంభం కానుంది. ‘న కార్తీక నమో మాసః న దేవం కేశవాత్పరం! నచవేద సమం శాస్త్రం!! న తీర్థం గంగాయాస్థమమ్’ అని స్కంద పురాణంలో ఉంది. అంటే కార్తీకానికి సమానమైన మాసము, కేశవుడికి సమానమైన దేవుడు, వేదముతో సమానమైన శాస్త్రం, గంగతో సమానమైన తీర్థము లేదు అని అర్థం. ఈ మాసంలో చేసే పూజలు, వ్రతాలు, ఉపవాసాలు శుభప్రదం. * రోజూ ఆధ్యాత్మిక కంటెంట్ కోసం <<-se_10013>>భక్తి<<>> కేటగిరీకి వెళ్లండి.

News October 22, 2025

రబీ సాగు- నేలను బట్టి ఈ పంటలతో లాభాలు

image

రబీలో నేల స్వభావం, నీటి తడులను బట్టి పంటలను ఎంపిక చేసుకోవాలని వ్యవసాయ నిపుణులు సూచిస్తున్నారు. దీని వల్ల రైతులు అధిక దిగుబడి సాధించి లాభాలు పొందేందుకు అవకాశం ఉంటుంది. నీటి సౌకర్యం ఉన్న ఎర్ర, నల్లరేగడి నేలల్లో వేరుశనగ, ఆముదం, పొద్దుతిరుగుడు, కంది, పెసర, మినుము, అలసంద, కుసుమ, నువ్వులు సాగు చేయవచ్చు. వర్షాధార ఎర్ర నేలల్లో ఉలవలు, జొన్నలు.. వర్షాధార నల్ల రేగడి నేలల్లో శనగ, కుసుమ, ఆవాలు సాగు చేయవచ్చు.

News October 22, 2025

భారీగా పెరగనున్న ఎరువుల ధరలు!

image

వానాకాలం సీజన్ ఆరంభంలో యూరియా కొరతతో రైతులు నానా అవస్థలు పడ్డ విషయం తెలిసిందే. ఇటీవల చైనా ఎరువుల ఎగుమతులు నిలిపివేయడంతో రబీ సీజన్‌లోనూ ఇబ్బందులు తప్పేలా లేవు. యూరియా, డీఏపీ తదితర ఎరువులను దాదాపు 95% ఆ దేశం నుంచే దిగుమతి చేసుకుంటున్నాం. చైనా ఆంక్షలతో ధరలు 10-15% మేర పెరిగే అవకాశముందని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఈ పరిస్థితి 5-6 నెలలు కొనసాగొచ్చని తెలుస్తోంది. దీంతో రైతులపై అదనపు భారం పడనుంది.