News April 22, 2025
కాల్పులతో దద్దరిల్లుతున్న కర్రెగుట్ట

మావోయిస్టులే లక్ష్యంగా ఛత్తీస్‌గఢ్-తెలంగాణ సరిహద్దులోని కర్రెగుట్టపై భారీ ఆపరేషన్ కొనసాగుతోంది. ఇరు రాష్ట్రాల పోలీసులు, CRPF బలగాలు సంయుక్తంగా గుట్టను చుట్టుముట్టి కాల్పులతో చొచ్చుకెళ్తున్నాయి. అక్కడ భారీగా మావోలు ఉంటారనే సమాచారంతో ఈ ఆపరేషన్ చేపట్టారు. కాగా కర్రెగుట్ట చుట్టూ బాంబులు పెట్టామని, ఎవరూ రావొద్దని ఇటీవలే మావోలు ప్రకటించారు. తాజా ఘటనతో ఏం జరుగుతుందోనని స్థానికంగా భయాందోళనలు నెలకొన్నాయి.
Similar News
News August 6, 2025
బీజేపీలో చేరే వారికి ఆహ్వానం: రామ్‌చందర్

TG: బీజేపీలో చేరే నేతలకు ఆహ్వానం పలుకుతామని పార్టీ రాష్ట్ర చీఫ్ రామ్‌చందర్ రావు అన్నారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ నేతలు తమ పార్టీవైపే చూస్తున్నారని చెప్పారు. ఆసిఫాబాద్‌లో పార్టీ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. తాము ఎవరినీ ప్రలోభాలకు గురిచేయట్లేదని తెలిపారు. నేతలకు ఆ రెండు పార్టీలపై నమ్మకం లేదన్నారు. డబుల్ ఇంజిన్ సర్కార్‌తోనే అభివృద్ధి సాధ్యమని చెప్పారు.
News August 6, 2025
ట్రంప్ వ్యాఖ్యలపై మోదీ అందుకే స్పందించట్లేదు: రాహుల్

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పదేపదే <<17312842>>బెదిరింపులకు<<>> పాల్పడుతున్నా ప్రధాని మోదీ అడ్డుకోకపోవడంపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ Xలో విమర్శలకు దిగారు. అదానీ వ్యవహారంలో యూఎస్ దర్యాప్తు చేపట్టడమే మోదీ వైఖరికి కారణమన్నారు. రష్యాతో ఆయిల్ డీల్స్‌లో మోదీ, అదానీ-అంబానీ ఆర్థిక వ్యవహారాలను బయటపెట్టే ప్రమాదం ఉందనన్నారు. మోదీ చేతులు కట్టేశారని విషయాన్ని భారత్ అర్థం చేసుకోవాలని రాసుకొచ్చారు.
News August 6, 2025
హీరోలకు రూ.100 కోట్లు.. మాకు వేతనాలు పెంచలేరా?: కార్మికులు

టాలీవుడ్‌లో నిర్మాతలకు, ఫెడరేషన్‌కు మధ్య వివాదం ఇంకా సద్దుమణగలేదు. సినిమాల్లో నటించే హీరోలకు రూ.100 కోట్లు ఇస్తున్నారని, తమకు వేతనాలు పెంచితే నష్టమేంటని కార్మికులు ప్రశ్నిస్తున్నారు. సాఫ్ట్‌వేర్ వాళ్లకు నెలకు జీతం వస్తుందని, తమకు నెలలో సగం రోజులే పని దొరుకుతుందని చెబుతున్నారు. ముంబై టెక్నీషియన్లను తీసుకొచ్చేందుకు పెట్టే ఖర్చులో కనీసం సగం తమకు ఇచ్చినా తమ బతుకులు మారతాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.