News October 22, 2025
కార్తీక మాసం.. భారీగా తగ్గనున్న చికెన్ ధరలు

నేటి నుంచి పవిత్రమైన కార్తీక మాసం ప్రారంభమైంది. చాలామంది మాంసాహారం ముట్టకుండా శివుడికి భక్తిశ్రద్ధలతో పూజలు చేస్తారు. దీంతో చికెన్ రేట్లు భారీగా తగ్గే అవకాశం ఉందని వ్యాపారులు చెబుతున్నారు. ప్రస్తుతం ప్రాంతాన్ని బట్టి కేజీ కోడి మాంసం ధర రూ.210 నుంచి రూ.250 వరకు పలుకుతోంది. 2,3 రోజుల్లో రేట్లు తగ్గడం ప్రారంభం అవుతుందని చెబుతున్నారు. కేజీ చికెన్ ధర రూ.170-180కి రావొచ్చని అంటున్నారు.
Similar News
News October 22, 2025
ఇల్లు లేనివారు దరఖాస్తు చేసుకోవాలి: కొలుసు

AP: పట్టణ ప్రాంతాల్లో ఇప్పటికే 50% ఇళ్లు మంజూరు చేశామని మంత్రి కొలుసు పార్థసారథి తెలిపారు. లబ్ధిదారుల ఎంపికకు వచ్చేనెల 5 వరకు సర్వే నిర్వహిస్తామని, ఇళ్లు లేనివారు అప్పటివరకు దరఖాస్తు చేసుకోవచ్చని సూచించారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 7.28లక్షల ఉద్యోగాలు కల్పించినట్లు వెల్లడించారు. 16నెలల్లోనే రూ.7.65లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయన్నారు. ప్రభుత్వ కార్యక్రమాలపై 75.1% ప్రజలు సంతృప్తిగా ఉన్నట్లు చెప్పారు.
News October 22, 2025
స్థానిక ఎన్నికలపై రేపే తుది నిర్ణయం?

TG: స్థానిక ఎన్నికలపై నెలకొన్న గందరగోళానికి రేపు తెరపడే అవకాశం కనిపిస్తోంది. పాత పద్ధతిలోనే ఎలక్షన్స్ వెళ్లాలా? లేదా బీసీలకు 42% రిజర్వేషన్లు అమలు చేశాకే నిర్వహించాలా? అనేదానిపై CM రేవంత్ అధ్యక్షతన మ.3 గంటలకు జరిగే క్యాబినెట్ భేటీలో నిర్ణయించనున్నారు. పాత పద్ధతినే అవలంబిస్తే పార్టీ పరంగా 42% రిజర్వేషన్లు ఇచ్చే ఆస్కారముంది. ఇద్దరు పిల్లల నిబంధన ఎత్తివేత ఆర్డినెన్స్‌కు క్యాబినెట్ ఆమోదం తెలపనుంది.
News October 22, 2025
కొత్త దర్శకుల విజయం: వినూత్న కథాంశాలే బలం!

వినూత్న కథలతో ప్రేక్షకులను థియేటర్లకు తీసుకురావడంలో యువ డైరెక్టర్లు సఫలమవుతున్నారు. సూపర్ హీరో జోనర్ ‘హనుమాన్’తో భారీ విజయం పొందారు ప్రశాంత్ వర్మ. HIT 1&2తో క్రైమ్, ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ జోనర్‌తో శైలేష్ కొలను అదరగొట్టారు. అరిషడ్వర్గాలు అనే మైథలాజికల్ అంశంపై సస్పెన్స్ థ్రిల్లర్ ‘అరి’ మూవీతో మెప్పించారు డైరెక్టర్ జయశంకర్. 96, సత్యంసుందరంతో తమిళ డైరెక్టర్ ప్రేమ్ కుమార్ తెలుగువాళ్లకు దగ్గరయ్యారు.