News October 22, 2025
కార్తీకం: ప్రమిదల్లో ఎన్ని వత్తులు ఉండాలి?

కార్తీక మాసంలో ప్రమిదలో రెండు వత్తులను వెలిగిస్తే శాంతి లభిస్తుందని పండితులు చెబుతున్నారు. 3 వత్తులు ధనవృద్ధినీ, నాలుగు ఐశ్వర్యాన్నీ, ఐదు అఖండ సంపదల్నీ, ఏడు మోక్షాన్నీ ప్రసాదిస్తాయంటున్నారు. మనలో ఉండే పంచతత్వాలకు నిదర్శనంగా 5 రుచులతో ఉండే ఉసిరికపైనా దీపాన్ని వెలిగించవచ్చని పేర్కొంటున్నారు. అయితే ఒక వత్తిని వెలిగించినా పుణ్యం లభిస్తుందని వివరిస్తున్నారు.
Similar News
News October 22, 2025
జూబ్లీహిల్స్: ప్రచార బరిలో బిగ్ బుల్స్

TG: జూబ్లీహిల్స్ ఉపఎన్నిక ప్రచారంలో ఆయా పార్టీల స్టార్ క్యాంపెయినర్ల జాబితాలో CM రేవంత్, గులాబీ బాస్ KCR, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఉన్నారు. ఈ నేతల ప్రచారం వారి పార్టీలకు ప్లస్‌గా మారే అవకాశముంది. అయితే ఇది ఓటర్లను ఏ విధంగా ప్రభావితం చేస్తుందో వేచి చూడాలి. అధికారంలో ఉన్న కాంగ్రెస్ గెలుపుపై కన్నేయగా సిట్టింగ్ స్థానాన్ని కాపాడుకోవాలని BRS చూస్తోంది. అటు BJP సంచలనం నమోదు చేయాలని ఉవ్విళ్లూరుతోంది.
News October 22, 2025
వేదవాక్కులే శిరోధార్యాలు

వేదం నుంచి జ్ఞానం, సంస్కృతి, జీవితానికి సంబంధించిన మార్గదర్శకాలు, అనేక ఇతర విషయాలు ఉత్పన్నమవుతాయి. వేదం అనేది సంస్కృత మూల పదం ‘విద్’ నుంచి వచ్చింది. వేదం వల్ల ఉత్పన్నమయ్యే శబ్ద తరంగాలు లోకమంతా వ్యాపించి సత్ఫలితాలనిస్తాయి. రోగాలు సహా అనేక బాధల నుంచి విముక్తిని ప్రసాదించే శక్తి వేద మంత్రాలకుంది. భగవంతుని ఉచ్వాస నిశ్వాసాలే వేదాలు. అందుకే సకల మానవాళికి వేద వాక్కులు శిరోధార్యాలు.
<<-se>>#VedicVibes<<>>
News October 22, 2025
నేటి నుంచి కార్తీక వైభవం

శివకేశవులకు ప్రీతికరమైన కార్తీక మాసం నేడు ప్రారంభం కానుంది. ‘న కార్తీక నమో మాసః న దేవం కేశవాత్పరం! నచవేద సమం శాస్త్రం!! న తీర్థం గంగాయాస్థమమ్’ అని స్కంద పురాణంలో ఉంది. అంటే కార్తీకానికి సమానమైన మాసము, కేశవుడికి సమానమైన దేవుడు, వేదముతో సమానమైన శాస్త్రం, గంగతో సమానమైన తీర్థము లేదు అని అర్థం. ఈ మాసంలో చేసే పూజలు, వ్రతాలు, ఉపవాసాలు శుభప్రదం. * రోజూ ఆధ్యాత్మిక కంటెంట్ కోసం <<-se_10013>>భక్తి<<>> కేటగిరీకి వెళ్లండి.