News March 21, 2024
మహేశ్ ఫ్యాన్‌కు కార్తికేయ అదిరిపోయే రిప్లై

జపాన్‌లో భూకంపం భయాందోళనలకు గురిచేసినట్లు SS కార్తికేయ <<12894254>>ట్వీట్<<>> చేసిన సంగతి తెలిసిందే. దీనిపై మహేశ్ అభిమాని ఒకరు స్పందిస్తూ మహేశ్-రాజమౌళి మూవీ ట్రైలర్ ఇంపాక్ట్‌కు రిహార్సల్ చేస్తున్నారని కార్తికేయను ట్యాగ్ చేస్తూ ట్వీట్ చేశారు. దీనికి కార్తికేయ అదిరిపోయే రిప్లై ఇచ్చారు. ఆ ఇంపాక్ట్ జపాన్‌లోనే కాకుండా ప్రపంచమంతా ఉంటుందని పేర్కొన్నారు. దీంతో హైప్‌కే పోయేలా ఉన్నామని ఫ్యాన్స్ కామెంట్లు చేస్తున్నారు.
Similar News
News April 7, 2025
అత్యంత అందమైన అమ్మాయిలు ఎక్కడున్నారంటే?

సౌత్ కొరియాకు చెందిన మహిళలు ఎంతో బ్యూటిఫుల్‌గా ఉంటారని ‘ఇన్‌సైడర్ మంకీ’ రిపోర్టులో తేలింది. టాప్-50 దేశాల జాబితాలో ఇండియా 18వ స్థానంలో నిలిచింది. సౌత్ కొరియా తర్వాత బ్రెజిల్, అమెరికా, జపాన్, మెక్సికో, జర్మనీ, కొలంబియా, థాయ్‌లాండ్, ఇటలీ, వెనిజుల దేశాలు టాప్-10లో ఉన్నాయి.
News April 7, 2025
ఉత్తరాదికి నిధులు.. దక్షిణాదికి మోసం: కోదండరాం

కేంద్ర ప్రభుత్వం చేపట్టబోయే డీలిమిటేషన్‌తో దక్షిణాదిలో సీట్లు తగ్గుతాయని MLC కోదండరామ్ ఆందోళన వ్యక్తం చేశారు. HYDలో ఈ అంశంపై జరిగిన సెమినార్‌లో ఆయన మాట్లాడారు. జనాభా ప్రాతిపాదికన డీలిమిటేషన్ చేస్తే దక్షిణాదికి తీవ్రంగా నష్టం జరుగుతుందన్నారు. పన్ను వసూళ్లలో మనమే ఎక్కువ చెల్లిస్తున్నామని వివరించారు. కానీ ఉత్తరాదికి ఎక్కువ నిధులు కేటాయిస్తూ, దక్షిణాదిని కేంద్రం మోసం చేస్తోందన్నారు.
News April 7, 2025
నాని ‘ది ప్యారడైజ్’లో ఉప్పెన బ్యూటీ?

‘ది ప్యారడైజ్’ మూవీ ఫస్ట్ లుక్‌తోనే అభిమానుల్లో అంచనాలను భారీగా పెంచేశారు దర్శకుడు శ్రీకాంత్ ఓదెల. హీరో నానిని సరికొత్తగా చూపిస్తోండగా తాజాగా మరో న్యూస్ వైరలవుతోంది. ఈ సినిమాలో ‘ఉప్పెన’ బ్యూటీ కృతి శెట్టి నటించనుందని తెలుస్తోంది. ఇదే విషయమై హీరోయిన్‌తో దర్శకుడు చర్చల్లో ఉన్నట్లు సమాచారం. ‘దసరా’లో కీర్తిని డీగ్లామర్‌గా చూపించగా ఈ మూవీలో బేబమ్మను ఎలా చూపిస్తారో అని ఫ్యాన్స్ చర్చించుకుంటున్నారు.