News November 2, 2024
నేటి నుంచి శ్రీశైలంలో కార్తీక మాసోత్సవాలు
AP: శ్రీశైల మహాక్షేత్రంలో ఇవాళ్టి నుంచి డిసెంబర్ 1 వరకు కార్తీక మాసోత్సవాలు జరగనున్నాయి. భ్రమరాంబికా మల్లికార్జున స్వామివార్లను దర్శించుకునేందుకు భారీగా భక్తులు రానుండటంతో అధికారులు పటిష్ఠ ఏర్పాట్లు చేశారు. కార్తీక సోమవారాలు, పౌర్ణమి రోజున పుష్కరిణి వద్ద లక్ష దీపార్చన, హారతి కార్యక్రమాలు వైభవంగా నిర్వహించనున్నారు. ఉత్సవాల ప్రారంభ సూచికగా ఆలయ ప్రాంగణంలో నేడు అర్చకులు ఆకాశ దీపాన్ని వెలిగిస్తారు.
Similar News
News November 2, 2024
ట్రంప్ గెలవగానే యుద్ధానికి చెక్?
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్ గెలిచిన వెంటనే రష్యా-ఉక్రెయిన్ యుద్ధానికి ఫుల్ స్టాప్ పెడతారని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ప్రస్తుతం ఉక్రెయిన్ అమెరికా మిలిటరీ, నిధులపై విపరీతంగా ఆధారపడుతోంది. 2022 నుంచి బైడెన్ ప్రభుత్వం ఉక్రెయిన్‌కు 56 బిలియన్ డాలర్ల ఆర్థికసాయం చేశారు. అయితే యుద్ధం ఆపితే భారీగా నిధులు ఆదా చేసుకుని అమెరికా అభివృద్ధికి ఖర్చు పెట్టాలని ట్రంప్ భావిస్తున్నట్లు సమాచారం.
News November 2, 2024
ఎల్లుండి టెట్ ఫలితాలు.. 6న డీఎస్సీ నోటిఫికేషన్
AP: అక్టోబర్ 3 నుంచి 21 వరకు జరిగిన టెట్ ఫలితాలను ఎల్లుండి మంత్రి లోకేశ్ విడుదల చేయనున్నారు. ఈ మేరకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 3,68,661 మంది పరీక్షలకు హాజరయ్యారు. టెట్ రిజల్ట్స్ రాగానే ఈ నెల 6వ తేదీన 16,347 టీచర్ పోస్టులతో మెగా డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసేందుకు పాఠశాల విద్యాశాఖ కసరత్తు చేస్తోంది. ఫిబ్రవరిలో పరీక్షలు నిర్వహించనుంది.
News November 2, 2024
సికింద్రాబాద్ నుంచి పుణేకు వందే భారత్!
TG: సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి మరో వందే భారత్ సర్వీస్ ప్రారంభమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. మహారాష్ట్ర ఎన్నికల తర్వాత సికింద్రాబాద్ నుంచి పుణేకు వందే భారత్ ఎక్స్‌ప్రెస్ ప్రారంభించేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. ప్రస్తుతం ఈ రెండు నగరాల మధ్య శతాబ్ది ఎక్స్‌ప్రెస్ సేవలు అందిస్తోంది. అది మధ్యాహ్నం సికింద్రాబాద్ నుంచి బయలుదేరుతుండగా ఈ వందే భారత్‌ను ఉదయం పంపించే అవకాశం ఉంది.