News November 16, 2024

తిరుమలలో రేపు కార్తీక వనభోజనం.. పటిష్ఠ ఏర్పాట్లు

image

AP: తిరుమలలో రేపు కార్తీక వన భోజన కార్యక్రమం సందర్భంగా పలు ఆర్జిత సేవలను టీటీడీ రద్దు చేసింది. వర్ష సూచనల నేపథ్యంలో వన భోజనం నిర్వహణ వేదికను పార్వేట మండపం నుంచి వైభవోత్సవం మండపానికి మార్చినట్లు తెలిపింది. రేపు ఉ.11 గంటలకు గజ వాహనంపై ఊరేగింపుగా వైభవోత్సవ మండపానికి మలయప్పస్వామి రానున్నారు. పెద్ద సంఖ్యలో భక్తులు వచ్చే అవకాశం ఉండటంతో అధికారులు పటిష్ఠ ఏర్పాట్లు చేశారు.

Similar News

News November 16, 2024

మూసీ ప్రక్షాళనకు రూ.1.50 లక్షల కోట్లు ఎందుకు?: కేటీఆర్

image

TG: మూసీ పేరుతో ఢిల్లీకి మూటలు పంపేందుకు సీఎం రేవంత్ రెడ్డి ప్రయత్నిస్తున్నారని కేటీఆర్ విమర్శించారు. మూసీ ప్రక్షాళనకు రూ.1.50 లక్షల కోట్లు ఎందుకని నిలదీశారు. తెలంగాణ భవన్‌లో మాట్లాడుతూ ‘కేసీఆర్, బీఆర్ఎస్‌ను ఫినిష్ చేస్తామని రేవంత్ అంటున్నారు. గతంలో ఇలా అన్న వాళ్లే తెలంగాణలో లేకుండా పోయారని గుర్తుంచుకోవాలి. ఇప్పుడు పార్టీ మారిన ఎమ్మెల్యేలంతా రాజకీయంగా ఆత్మహత్య చేసుకున్నట్లే’ అని స్పష్టం చేశారు.

News November 16, 2024

సనాతనాన్ని రక్షించడానికే శివసేన- జనసేన: పవన్

image

శివాజీ మహారాజ్ గడ్డపై అడుగుపెట్టినందుకు సంతోషంగా ఉందని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు. సనాతనాన్ని రక్షించడానికే శివసేన- జనసేన ఆవిర్భవించాయని చెప్పారు. ఈ 2పార్టీలు అన్యాయంపై పోరాడతాయని తెలిపారు. జాతీయభావం, ప్రాంతీయతత్వం తమ పార్టీల సిద్ధాంతం అని వివరించారు. మహాయుతి తరఫున మహారాష్ట్రలోని డెగ్లూర్‌లో ప్రచారం నిర్వహించిన పవన్ బాల సాహెబ్ ఠాక్రే నుంచి ఎంతో నేర్చుకున్నానని వెల్లడించారు.

News November 16, 2024

మ్యాక్సీ అరుదైన రికార్డు

image

T20 క్రికెట్‌లో గ్లెన్ మ్యాక్స్‌వెల్ అరుదైన రికార్డు సృష్టించారు. అతి తక్కువ బంతుల్లో(6,505) 10,000 పరుగులు చేసిన ప్లేయర్‌గా నిలిచారు. ఆ తర్వాతి స్థానాల్లో పొలార్డ్(6,640), క్రిస్ గేల్(6,705), అలెక్స్ హేల్స్(6,774), జోస్ బట్లర్(6,928) ఉన్నారు. ఓవరాల్‌గా పదివేల పరుగులు పూర్తిచేసుకున్న 16వ ఆటగాడిగా మ్యాక్సీ ఘనత సాధించారు.