News January 12, 2025
కరుణ్ నాయర్ మళ్లీ సెంచరీ
విజయ్ హజారే ట్రోఫీలో విదర్భ కెప్టెన్ <<15055540>>కరుణ్ నాయర్<<>> ఆకాశమే హద్దుగా చెలరేగుతున్నారు. రాజస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో నాయర్ (122*) మరో సెంచరీ బాదారు. ఇప్పటికే ఈ టోర్నీలో నాలుగు సెంచరీలు సాధించిన విషయం తెలిసిందే. 82 బంతుల్లోనే 13 ఫోర్లు, 5 సిక్సర్లతో 122 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచారు. నాయర్ కెప్టెన్సీ ఇన్నింగ్స్‌తో విదర్భ సెమీ ఫైనల్‌కు దూసుకెళ్లింది.
Similar News
News January 12, 2025
రేపు భోగి.. ఈ జాగ్రత్తలు తీసుకోండి
తెలుగు రాష్ట్రాల్లో రేపు భోగి వేడుకలు వైభవంగా జరగనున్నాయి. భోగి మంటల వద్ద పలు జాగ్రత్తలు తీసుకోవడం మంచిది. పెట్రోల్, డీజిల్ లాంటి మండే పదార్థాలను దూరంగా ఉంచాలి. మంట చుట్టూ చేరేవారు కాటన్ దుస్తులు ధరించాలి. శ్వాసకోశ, ఊపిరితిత్తుల సమస్యలున్నవారు, రోగులు, వృద్ధులు, చిన్నపిల్లలు మంటలకు దూరంగా ఉండాలి. ప్రమాదం జరిగినప్పుడు మంటలను ఆర్పడానికి వీలుగా దగ్గర్లో నీళ్లు, దుప్పట్లు ఉంచుకోవాలి.
News January 12, 2025
హెల్మెట్ లేని వారికి పెట్రోల్ పోయొద్దు: UP ప్రభుత్వం
రోడ్డు ప్రమాదాల్లో మరణాల సంఖ్యను తగ్గించేందుకు ‘నో హెల్మెట్-నో ఫ్యూయెల్’ విధానాన్ని అమలు చేయాలని UP ప్రభుత్వం నిర్ణయించింది. హెల్మెట్ ధరించని వారికి పెట్రోల్ పోయవద్దని బంకులను ఆదేశించింది. పిలియన్ రైడర్ సైతం హెల్మెట్ ధరించాలని పేర్కొంది. ఈ రూల్స్‌ను కఠినంగా అమలు చేయాలని అన్ని జిల్లాలను ఆదేశించింది. ఏటా రోడ్డు ప్రమాదాల వల్ల UPలో 25,000-26,000 మంది చనిపోతున్నట్లు ఇటీవల CM యోగి తెలిపారు.
News January 12, 2025
భారత్ ఘన విజయం.. సిరీస్ కైవసం
ఐర్లాండ్ మహిళల టీమ్‌తో జరిగిన రెండో వన్డేలో భారత్ 116 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. దీంతో మరో వన్డే మిగిలి ఉండగానే స్మృతి మంధాన సేన 2-0తో సిరీస్ కైవసం చేసుకుంది. తొలుత 370/5 స్కోర్ చేసిన టీమ్ ఇండియా ప్రత్యర్థిని 254/7 స్కోరుకే పరిమితం చేసింది. దీప్తి శర్మ 3, ప్రియా మిశ్రా 2, టిటాస్, సయాలి చెరో వికెట్ తీశారు. బ్యాటింగ్‌లో జెమీమా(102), హర్లీన్(89), స్మృతి(73), ప్రతికా రావల్(67) రాణించారు.