News October 5, 2025

కరూర్ తొక్కిసలాట ప్లాన్డ్ ఇన్సిడెంట్: ఖుష్బూ

image

TVK చీఫ్ విజయ్ కరూర్ ర్యాలీలో తొక్కిసలాట జరిగి 41మంది చనిపోయిన విషయం తెలిసిందే. ఇది ప్లాన్/క్రియేట్ చేసిన ప్రమాదంగా నటి, BJP నేత ఖుష్బూ ఆరోపించారు. ‘తొక్కిసలాట నిర్లక్ష్యం వల్లే జరిగిందని ప్రజలు నమ్ముతున్నారు. ఇది సృష్టించిన విపత్తులా కనిపిస్తోంది. విజయ్ కోసం ఎంతమంది జనం వస్తారో ప్రభుత్వానికి తెలిసినా ర్యాలీకి సరైన స్థలం కేటాయించలేదు. CM మౌనం వీడి ప్రశ్నలకు సమాధానం చెప్పాలి’ అని డిమాండ్ చేశారు.

Similar News

News October 5, 2025

బంగారం ధరలు.. ఈ వారమూ పెరుగుతాయా?

image

మార్కెట్లకు సెలవు కావడంతో ఇవాళ బంగారం, వెండి ధరలు నిలకడగా ఉన్నాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,19,400గా ఉంది. అయితే గత వారం దీనిపై రూ.3,920 పెరగడం గమనార్హం. అలాగే 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర గత వారం రోజుల్లో రూ.3,600 పెరిగి రూ.1,09,450కు చేరింది. అలాగే కేజీ వెండిపై రూ.6వేలు పెరిగి ప్రస్తుతం రూ. 1,65,000గా ఉంది. ఈ వారం మార్కెట్లు ఎలా ఉంటాయో చూడాలి.

News October 5, 2025

రాష్ట్రంలో ఉద్యోగాలు.. అప్లై చేశారా?

image

APPSC వివిధ పోస్టులకు విడుదల చేసిన నోటిఫికేషన్లకు దరఖాస్తు చేయడానికి గడువు ముగుస్తోంది. లైబ్రేరియన్ సైన్స్‌లో JL(2), హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్(1) పోస్టులకు అప్లై చేయడానికి ఈనెల 7 ఆఖరు తేదీ. డ్రాఫ్ట్స్‌మన్ గ్రేడ్- 2(13), AEE (3), హార్టికల్చర్ ఆఫీసర్(2) పోస్టులకు OCT 8 లాస్ట్ డేట్. పోస్టును బట్టి వివిధ అర్హతలున్నాయి. రాతపరీక్ష ద్వారా ఎంపిక చేస్తారు. వెబ్‌సైట్: https://portal-psc.ap.gov.in/

News October 5, 2025

భగవంతుడు అవతారాలు ఎందుకెత్తాడు?

image

నిర్గుణంచేంద్రియాతీతం, నిరాకారం నిరంజనం |
స్వభక్త రక్షణార్థాయ, జాయతేహి యుగేయుగే ||
పరిత్రాణాయ సాధూనాం, వినాశాయచ దుష్కృతామ్ |
ధర్మసంస్థాపనార్థాయ, సంభవామి యుగేయుగే ||
భగవంతుడు గుణములు, ఇంద్రియాలు లేనివాడు. నిరాకారుడు. నిరంజనుడు. అయినా తన భక్తులకు కాపాడుకోవడానికి సిద్ధపడతాడు. సజ్జనులను రక్షించాలని, దుష్టులను శిక్షించాలని, ధర్మమును కాపాడాలని అవతారాలు ఎత్తాడు. <<-se>>#WhoIsGod<<>>