News October 6, 2025

ప్రభుత్వ వైఫల్యంతోనే కరూర్ తొక్కిసలాట : NDA MPలు

image

కరూర్(TN) తొక్కిసలాటలో 41 మరణాలపై NDA MPలు నివేదిక రూపొందించారు. ప్రభుత్వ వైఫల్యమే కారణమని తేల్చారు. జనాల సంఖ్యపై అంచనాలేమి, క్రౌడ్ మేనేజ్మెంటులో వైఫల్యం ఉందన్నారు. 3వేల మంది పట్టే గ్రౌండ్‌లో 30వేల మంది గుమిగూడారు. 2 గం.కు రావలసిన విజయ్ రాత్రి 7 గం.కు వచ్చారు. ఆయన బస్సుపైకెక్కి అభివాదం చేస్తుండగా తొక్కిసలాట జరిగింది. నివారించదగ్గదే అయినా అడ్మినిస్ట్రేషన్ వైఫల్యం వల్ల ఇది జరిగిందని పేర్కొన్నారు.

Similar News

News March 17, 2026

చావు నుంచి క్షణాల్లో తప్పించుకున్న మొజ్తబా

image

ఇజ్రాయెల్ దాడిలో అయతుల్లా అలీ ఖమేనీ సహా ఇతర కుటుంబీకులు, ఇరాన్ ఉన్నతాధికారులు మరణించిన విషయం తెలిసిందే. అయితే ఆ అటాక్ నుంచి ప్రస్తుత ఇరాన్ సుప్రీం లీడర్ మొజ్తబా ఖమేనీ త్రుటిలో తప్పించుకున్నారంటూ ఆ దేశ అధికారులు మాట్లాడుకున్న ఆడియో లీకైనట్లు ‘టెలిగ్రాఫ్’ తెలిపింది. ఖమేనీ నివాసంపై మిస్సైల్ పడటానికి కొన్ని సెకన్ల ముందే మొజ్తబా గార్డెన్‌లోకి నడుచుకుంటూ వెళ్లడంతో స్వల్ప గాయాలతో బయటపడ్డారని పేర్కొంది.

News March 17, 2026

తక్కువ ఖర్చు.. ఎక్కువ లాభం: రోజూ స్వీట్ పొటాటో తింటే?

image

తక్కువ రేటుకు లభించే స్వీట్ పొటాటోలో బీటా కెరోటిన్, విటమిన్-A, C, E, B6, పొటాషియం, పీచు తదితర పోషకాలు ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. క్యాన్సర్ల నుంచి రక్షించే యాంటీఆక్సిడెంట్లు ఎక్కువగా ఉంటాయంటున్నారు. ‘రోజూ చిలగడదుంప తింటే వ్యాధినిరోధక శక్తి, జ్ఞాపకశక్తి పెరుగుతాయి. ఆహారం త్వరగా జీర్ణమవుతుంది. మలబద్ధకం, బీపీ, ఒత్తిడి తగ్గుతాయి. కంటి, చర్మ ఆరోగ్యం మెరుగుపడుతుంది’ అని పేర్కొంటున్నారు.
#ShareIt

News March 17, 2026

మిరపలో ఈ సేద్య విధానం ఆదర్శం

image

మిరప సాగులో ప్రకృతి వ్యవసాయ పద్ధతిని అనుసరిస్తూ, తక్కువ ఖర్చుతో మంచి దిగుబడులు సాధిస్తున్నారు కొందరు రైతులు. సేంద్రియ కషాయాల వాడకంతో పాటు బంతి, ఆముదం మొక్కలను మిరపలో పెంచి చీడల ఉద్ధృతిని తగ్గిస్తున్నారు. పంటకు హాని చేసే పురుగుల తీవ్రతను తగ్గించడానికి జిగురు అట్టలు, సోలార్ ట్రాప్స్ వాడుతున్నారు. వీడ్ కంట్రోల్ మ్యాట్స్ వాడి కలుపును అరికడుతున్నారు. ఇలా రసాయనాలు లేకుండానే అధిక దిగుబడి సాధిస్తున్నారు.