News February 21, 2025

FBI డైరెక్టర్‌గా కాష్ పటేల్ నియామకం

image

అమెరికా నిఘా సంస్థ FBIకి డైరెక్టర్‌గా కాష్ పటేల్ అధికారికంగా నియమితులయ్యారు. ఈ మేరకు దేశ సెనేట్ ఆయనకు అనుకూలంగా ఓటేసింది. ఆయన ఈ పదవి స్వీకరిస్తున్న తొలి భారత సంతతి వ్యక్తి కావడం విశేషం. గుజరాత్‌కు చెందిన ఆయన తల్లిదండ్రులు 1970వ దశకంలో అమెరికాకు వలస వెళ్లారు. చరిత్ర, క్రిమినల్ జస్టిస్ విభాగాల్లో కాష్ డిగ్రీ చేశారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌కు ఆయన అత్యంత నమ్మకస్తుడిగా ఉన్నారు.

Similar News

News February 22, 2025

మతిమరుపునకు కారణం మీ నోరే: కొత్త స్టడీ

image

మతిమరుపు, చిగుళ్ల వ్యాధికి లింక్ ఉందంటున్నారు లూయిస్‌విల్లా మైక్రోబయాలజిస్ట్, Sr ఆథర్ జాన్ పొటెంపా. చిగుళ్ల రోగానికి కారణమయ్యే జింజివాలిస్ బ్యాక్టీరియానే నోటి నుంచి మెదడులోకి ప్రవేశిస్తున్నట్టు ఆయన గుర్తించారు. అక్కడ అది ఇన్‌ఫ్లమేషన్ పెంచి, అల్జీమర్స్‌తో సంబంధమున్న అమిలాయిడ్ ఫలకాలను నిర్మిస్తున్నట్టు పేర్కొన్నారు. వీటికి తోడు మరికొన్ని కారకాలు తోడవ్వడంతో అల్జీమర్స్ ముదురుతోందని చెప్తున్నారు.

News February 22, 2025

చరిత్ర సృష్టించిన ఆర్సీబీ ప్లేయర్

image

WPLలో ఆర్సీబీ ప్లేయర్ ఎలీసా పెర్రీ చరిత్ర సృష్టించారు. WPLలో అత్యధిక పరుగులు చేసిన రెండో బ్యాటర్‌గా రికార్డు నెలకొల్పారు. లీగ్‌లో ఇప్పటివరకు ఆమె 745 పరుగులు సాధించారు. అగ్ర స్థానంలో మెగ్ లానింగ్ (777) ఉన్నారు. మరోవైపు 700 పరుగులు చేసిన తొలి ఆర్సీబీ ప్లేయర్‌గానూ అరుదైన ఫీట్ నెలకొల్పారు. ముంబైతో జరిగిన మ్యాచులో ఆమె ఈ ఘనత సాధించారు.

News February 22, 2025

ఐకానిక్ టవర్‌ నిర్మాణం కోసం కమిటీ

image

AP: అమరావతిలో NRT సొసైటీ ఐకాన్ టవర్ ప్రాజెక్ట్ నిర్మాణం కోసం రాష్ట్ర ప్రభుత్వం ఓ కమిటీ వేసింది. మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అధ్యక్షుడిగా ఉండే ఈ కమిటీలో 9 మంది అధికారులు సభ్యులుగా ఉండనున్నారు. ఈ ప్రాజెక్టు నిర్మాణం పూర్తి చేసే బాధ్యతను ఈ కమిటీకి అప్పగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కాగా అమరావతికి ఒక ప్రత్యేక గుర్తింపును తీసుకొచ్చేందుకు ఈ ప్రాజెక్టును సర్కార్ నిర్మిస్తోంది.

error: Content is protected !!