News April 23, 2025

ఇవాళ కశ్మీర్ బంద్.. అన్ని పార్టీల మద్దతు

image

ఉగ్రదాడికి నిరసనగా ఇవాళ జమ్మూకశ్మీర్‌లో బంద్‌కు JKHC, CCIK, ట్రావెల్, ట్రేడ్ సంఘాలు పిలుపునిచ్చాయి. దీనికి అధికార నేషనల్ కాన్ఫరెన్స్‌తో పాటు పీడీపీ, ఇతర పార్టీలు కూడా మద్దతిచ్చాయి. మృతులకు నివాళిగా పలు ప్రాంతాల్లో క్యాండిల్‌లైట్లతో నిరసన తెలపనున్నాయి. ప్రజలంతా స్వచ్ఛందంగా పాల్గొనాలని కోరాయి.

Similar News

News April 23, 2025

BIG BREAKING: టెన్త్ ఫలితాలు విడుదల

image

AP: టెన్త్ పబ్లిక్ పరీక్షల ఫలితాలు విడుదలయ్యాయి. మంత్రి లోకేశ్ X వేదికగా ఫలితాలను ప్రకటించారు. Way2News యాప్‌ ఓపెన్ చేయగానే కనిపించే స్క్రీన్‌లో హాల్ టికెట్ నంబర్ ఎంటర్ చేసి మీ రిజల్ట్స్ తెలుసుకోవచ్చు. ఆ మార్క్స్ జాబితాను సులభంగా ఇతరులకు షేర్ చేయొచ్చు.
SHARE IT

News April 23, 2025

పహల్‌గామ్ ఉగ్రదాడికి సూత్రధారి ఇతడేనా?

image

J&K పహల్‌గామ్ ఉగ్రదాడి వెనుక లష్కరే తోయిబా టాప్ కమాండర్ సైఫుల్లా సాజిద్ జట్ హస్తం ఉండొచ్చని జాతీయ మీడియాలో వార్తలొస్తున్నాయి. పాక్‌లోని పంజాబ్ ప్రావిన్స్‌కు చెందిన సాజిద్‌ను సైఫుల్లా కసూరీగానూ పిలుస్తారు. NIA ఇతడిని కఠినమైన ఉగ్రవాదిగా పేర్కొంది. ప్రస్తుతం ఇస్లామాబాద్ నుంచి ఇతడు ఆపరేషన్స్ చేపడుతున్నట్లు తెలుస్తోంది. పాకిస్థానీ ISI, ఆర్మీతో ఇతడికి సన్నిహిత సంబంధాలు ఉన్నాయి.

News April 23, 2025

ఉగ్రదాడి.. ప్రత్యేక విమానాల్లో స్వస్థలాలకు మృతదేహాలు

image

పహల్‌గామ్ ఉగ్రదాడిలో మృతుల సంఖ్య 28కి చేరినట్లు అధికారులు అధికారికంగా ప్రకటించారు. ఇందులో ఇద్దరు విదేశీయులు (నేపాల్, UAE) ఉన్నట్లు తెలిపారు. నాలుగు ప్రత్యేక విమానాల్లో మృతదేహాలను స్వస్థలాలకు తరలిస్తున్నారు. నిన్న ఉగ్రవాదులు సైనికుల దుస్తుల్లో వచ్చి కాల్పులు జరిపిన విషయం తెలిసిందే. మొత్తం ఆరుగురు టెర్రరిస్టులు ఈ దాడికి పాల్పడినట్లు సమాచారం.

error: Content is protected !!