News March 10, 2025
అయ్యర్‌లో పెరిగిన కసి.. వరుస ట్రోఫీలతో సత్తా

BCCI సెంట్రల్ కాంట్రాక్ట్ నుంచి తొలగించిన తర్వాత శ్రేయస్ అయ్యర్‌లో కసి పెరిగింది. కెప్టెన్‌గా IPL-2024, రంజీ, సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలతో పాటు ఇరానీ కప్ గెలిపించారు. CTలో 4వ స్థానంలో బ్యాటింగ్ చేసి జట్టుకు వెన్నెముకగా నిలిచారు. ఇటీవల జరిగిన ఇంగ్లండ్ సిరీస్‌లో కోహ్లీకి గాయమవడంతో జట్టులోకి వచ్చిన అయ్యర్ కీలక సభ్యుడిగా మారారు. దీంతో శ్రేయస్‌కు BCCI మళ్లీ సెంట్రల్ కాంట్రాక్ట్ ఇవ్వనున్నట్లు సమాచారం.
Similar News
News March 10, 2025
కేసీఆర్ అప్పులు, తప్పులను అసెంబ్లీలో పెడతాం: CM రేవంత్

TG: తాము ప్రతిపక్షం లేని రాజకీయం చేయాలనుకోవడం లేదని సీఎం రేవంత్ అన్నారు. అసెంబ్లీలో ప్రతిపక్షానికే ఎక్కువ సమయం ఇస్తున్నామని తెలిపారు. మీడియా చిట్‌చాట్‌లో మాట్లాడుతూ ‘జీతభత్యం తీసుకుని పని చేయని వ్యక్తి కేసీఆర్. ఆయన చేసిన అప్పులు, తప్పులను అసెంబ్లీలో పెడతాం. KCRకు భయపడి కిషన్ రెడ్డి రాష్ట్ర ప్రభుత్వానికి సహకరించడం లేదు. మూసీకి నిధులు తెస్తే ఆయనకు సన్మానం చేస్తాం’ అని వ్యాఖ్యానించారు.
News March 10, 2025
2027 వన్డే WCకు ముందు 24 వన్డేలు

నెక్స్ట్ వన్డే ప్రపంచకప్ 2027 OCT, NOVలో సౌతాఫ్రికాలో జరగనుంది. అప్పటివరకు టీమ్ ఇండియా 24 వన్డేలు ఆడనుంది. బంగ్లా, ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా, అఫ్గానిస్థాన్, ఇంగ్లండ్, వెస్టిండీస్, న్యూజిలాండ్, శ్రీలంకలతో మూడేసి వన్డేలు ఉన్నాయి. ఇంగ్లండ్, న్యూజిలాండ్, ఆస్ట్రేలియాతో వారి సొంతగడ్డపైనే తలపడాల్సి ఉంది. అప్పటివరకు రోహిత్, కోహ్లీ వన్డేల్లో కొనసాగుతారా? కామెంట్ చేయండి.
News March 10, 2025
రేవంత్‌కు మానవత్వం కూడా లేదని తేలిపోయింది: KTR

TG: CM రేవంత్ అసమర్థత వల్లే గురుకులాల్లో విద్యార్థుల మరణాలు చోటు చేసుకుంటున్నాయని KTR విమర్శించారు. ఇవి కాంగ్రెస్ సర్కారు చేసిన హత్యలేనని మండిపడ్డారు. ‘ఆదిలాబాద్(D) ఇచ్చోడ బాలికల ఆశ్రమ పాఠశాలలో లాలిత్య అనే విద్యార్థిని అనుమానాస్పదంగా మృతిచెందడం తీవ్ర దిగ్భ్రాంతికరం. పుట్టెడు దుఃఖంలో ఉన్న తండ్రిని పోలీసులు అదుపులోకి తీసుకోవడం దుర్మార్గం. రేవంత్‌కు మానవత్వం కూడా లేదని తేలిపోయింది’ అని ట్వీట్ చేశారు.