News April 19, 2024
కౌన్ బనేగా బాపట్ల బాస్!

AP: బాపట్ల MP స్థానంలో ఎందరో రాజకీయ ప్రముఖులు పోటీ చేసి గెలుపొందారు. 1998లో మాజీ CM నేదురుమల్లి జనార్దన్ రెడ్డి ఇక్కడి నుంచి గెలిచారు. దగ్గుబాటి వెంకటేశ్వరరావు, పురందీశ్వరి, ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, దగ్గుబాటి రామానాయుడు వంటి ప్రముఖులు గెలిచారు. ప్రస్తుతం SC రిజర్వుడ్ అయిన ఈ సెగ్మెంట్‌లో మరోసారి నందిగం సురేశ్‌ని YCP బరిలో దింపింది. మాజీ IPS అధికారి టి.కృష్ణప్రసాద్‌ను TDP పోటీలో నిలిపింది.
<<-se>>#ELECTIONS2024<<>>
Similar News
News December 6, 2025
టాస్ గెలిస్తే.. సిరీస్ గెలిచినట్లే!

సౌత్ ఆఫ్రికాతో జరుగుతున్న 3 వన్డేల సిరీస్ 1-1తో సమమైన విషయం తెలిసిందే. విశాఖ వేదికగా ఇవాళ కీలక మ్యాచ్ జరగనుంది. ఈ సిరీస్ గెలవాలంటే టీమ్ ఇండియా ఇవాళ టాస్ గెలవాలి. మొదట బ్యాటింగ్ చేసి ఎంత భారీ స్కోర్ చేసినా.. రెండో ఇన్నింగ్స్‌లో మంచు దెబ్బకు బౌలింగ్ తేలిపోతోంది. ఇటీవల ఉమెన్స్ వరల్డ్ కప్‌లో విశాఖలో జరిగిన 5 ODIల్లో ఛేజింగ్ టీమే గెలిచింది. ఏ విధంగా చూసినా ఇవాళ్టి మ్యాచ్‌లో టాసే కీలకంగా కనిపిస్తోంది.
News December 6, 2025
ఇండిగో.. రిఫండ్ చేస్తే సరిపోతుందా?

ఇండిగో ఫ్లైట్స్ రద్దవడంతో వేలమంది ఇబ్బంది పడ్డారు. CEO సారీ కూడా చెప్పారు. టికెట్ డబ్బు రిఫండ్ చేస్తామన్నారు. చాలామంది జర్నీ క్యాన్సిల్ చేసుకున్నారు. దాంతో వాళ్లు ముందుగానే బుక్ చేసుకున్న హోటల్స్ రిఫండ్ చేస్తాయో లేదో తెలీదు. వేరే ఫ్లైట్స్‌కి వెళ్లిన వాళ్లు రూ.7 వేల టికెట్‌ని రూ.50 వేలకు కొన్నారు. ఇలా ఏదోలా ప్రయాణికులు నష్టపోయారు. మరి ఇండిగో కేవలం టికెట్ డబ్బు రిఫండ్ చేస్తే సరిపోతుందా? COMMENT.
News December 6, 2025
40 ఏళ్లు వచ్చాయా? ఈ అలవాట్లు మానేస్తే బెటర్

40 ఏళ్లు దాటిన తర్వాత ప్రాసెస్ చేసిన ఆహారాలు శరీరానికి సరిపడవు. చిప్స్, కేక్స్, కుకీస్ రక్తంలో చక్కెర స్థాయులను పెంచుతాయి. ఒత్తిడితో కార్టిసాల్ విడుదలై హై బీపీ, షుగర్, మెమొరీ లాస్‌కు కారణమవుతుంది. స్క్రీన్ ఎక్కువ చూస్తే గుండె జబ్బులు, మధుమేహ సమస్యల ప్రమాదం ఉంటుంది. స్మోకింగ్, డ్రింకింగ్‌కు దూరంగా ఉండాలి. క్రమం తప్పకుండా బ్లడ్, థైరాయిడ్ టెస్ట్‌లు చేయించుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.


