News May 1, 2024

కౌన్ బనేగా ‘డోన్’ కా డాన్

image

రాష్ట్రానికి ఇద్దరు ముఖ్యమంత్రుల(నీలం సంజీవరెడ్డి, కోట్ల విజయభాస్కర్‌)ను అందించిన ప్రాంతం కర్నూలు(D) డోన్. ఇక్కడ 16 సార్లు ఎన్నికలు జరిగితే 7 సార్లు KE కుటుంబ సభ్యులే గెలిచారు. 2014 నుంచి YCP పాగా వేసింది. 14,19లో గెలిచిన బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి మంత్రిగా ఉన్నారు. హ్యాట్రిక్ కోసం బుగ్గన పట్టుదలగా ఉన్నారు. ఇటు మాజీ CM కోట్ల కుమారుడు సూర్యప్రకాశ్ రెడ్డిని TDP బరిలోకి దింపింది.
<<-se>>#ELECTIONS2024<<>>

Similar News

News March 11, 2026

నేను ఎప్పుడనుకుంటే అప్పుడు యుద్ధం ఆగుతుంది: ట్రంప్

image

ఇరాన్‌పై పోరు త్వరలోనే ముగుస్తుందని US అధ్యక్షుడు ట్రంప్ ప్రకటించారు. దాడి చేయడానికి అక్కడ ఇంకేమీ మిగల్లేదన్నారు. తాను అనుకున్నప్పుడు యుద్ధం ఆగుతుందని తెలిపారు. హార్ముజ్‌లో బాంబులు పెట్టాలని ఇరాన్ ప్రయత్నించిందని.. కానీ తాము 16 మైన్ బోట్లను ధ్వంసం చేసి ఆ ప్లాన్‌ను తిప్పికొట్టామన్నారు. కాగా అంతకుముందు ఇరాన్‌పై దాడులు మరో రెండు వారాలు కొనసాగించాలని అనుకుంటున్నట్లు ఇజ్రాయెల్, US అధికారులు తెలిపారు.

News March 11, 2026

BREAKING: IPL తొలి దశ షెడ్యూల్ వచ్చేసింది

image

ఐపీఎల్-2026 తొలి దశ షెడ్యూల్ విడుదలైంది. మార్చి 28 నుంచి ఏప్రిల్ 12 వరకు జరిగే 20 మ్యాచుల తేదీలు, వేదికలను ఐపీఎల్ ప్రకటించింది. షెడ్యూల్ కోసం పైన ఇమేజ్‌లు చూడండి. తొలి దశలో ప్రతి జట్టు 4 మ్యాచులు ఆడనుంది. మూడు రాష్ట్రాల ఎన్నికల డేట్లు ప్రకటించిన తర్వాత ఐపీఎల్ పూర్తి షెడ్యూల్‌ను వెలువరిస్తామని BCCI తెలిపింది.

News March 11, 2026

BREAKING: IPL తొలి మ్యాచ్ ఎవరి మధ్య అంటే?

image

క్రికెట్ అభిమానులకు శుభవార్త. IPL-2026 తొలి మ్యాచ్ వివరాలు వెల్లడయ్యాయి. ఈ నెల 28న తొలి మ్యాచ్ జరగనుంది. బెంగళూరులో రా.7.30 గంటలకు జరిగే ఈ పోరులో రాయల్ ఛాలెంజర్స్, సన్ రైజర్స్ తలపడనున్నట్లు IPL ట్వీట్ చేసింది. మరికాసేపట్లో తొలి దశ షెడ్యూల్ రానుంది.