News January 13, 2025

కౌశిక్ రెడ్డి అరెస్ట్ అత్యంత దుర్మార్గం: KTR

image

TG: పాడి కౌశిక్ రెడ్డిని అరెస్ట్ చేయడం అత్యంత దుర్మార్గమైన చర్య అని మాజీ మంత్రి కేటీఆర్ మండిపడ్డారు. పూటకో కేసు పెట్టి రోజుకో బీఆర్ఎస్ నేతను అన్యాయంగా అరెస్ట్ చేయడం రేవంత్ సర్కార్‌కు అలవాటుగా మారిందని ధ్వజమెత్తారు. ‘ప్రజల పక్షాన ప్రశ్నించిన కౌశిక్‌పై కేసులు పెట్టడమే ఇందిరమ్మ రాజ్యమా? చిల్లర చేష్టలతో BRS ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీయలేరు. కౌశిక్‌ను బేషరతుగా విడుదల చేయాలి’ అని ఆయన డిమాండ్ చేశారు.

Similar News

News January 14, 2025

ఫ్యామిలీతో చెర్రీ సెలబ్రేషన్స్

image

గ్లోబల్ స్టార్ రామ్‌చరణ్ తన ఫ్యామిలీతో సంక్రాంతి సెలబ్రేట్ చేసుకున్నారు. ఆయన సతీమణి ఉపాసన.. చెర్రీ, క్లీంకారతో ఉన్న ఫొటోను షేర్ చేస్తూ అభిమానులకు సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. ‘ఇంతకాలంగా మాపై చూపిస్తున్న ప్రేమ, ఆదరణకు కృతజ్ఞతలు’ అని ఉపాసన పేర్కొన్నారు.

News January 14, 2025

సాఫ్ట్‌వేర్ ఇంజినీర్లకు BIG షాక్!

image

సాఫ్ట్‌వేర్ ఇంజినీర్లకు కష్టకాలం మొదలైనట్టే! 2025లో మిడ్ లెవల్ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్లను AIతో రిప్లేస్ చేస్తామని మెటా సీఈవో మార్క్ జుకర్‌బర్గ్ అన్నారు. ఇతర కంపెనీలూ ఇదే బాటలో నడుస్తాయని స్పష్టం చేశారు. ప్రస్తుతం మనుషులు చేస్తున్న కాంప్లెక్స్ కోడింగ్ టాస్కులను హ్యాండిల్ చేయగలిగే AI సిస్టమ్స్‌ను మెటా సహా టెక్ కంపెనీలు డెవలప్ చేస్తున్నాయని తెలిపారు. కోడ్ రాయగలిగే AIను మోహరిస్తున్నామని వెల్లడించారు.

News January 14, 2025

దేశంలో అత్యంత రద్దీ నగరంగా కోల్‌కతా

image

భారత్‌లో ట్రాఫిక్ ఎక్కువగా ఉండే నగరాల జాబితాలో కోల్‌కతా టాప్‌లో నిలిచింది. ఈ విషయంలో బెంగళూరును అధిగమించింది. 2024 టామ్‌టామ్ ట్రాఫిక్ ఇండెక్స్ ప్రకారం 10kms ప్రయాణానికి కోల్‌కతాలో 34min 33s, బెంగళూరులో 34min 10s టైమ్ పడుతుంది. ఈ రెండింటి తర్వాతి స్థానాల్లో పుణే (33m 22s), హైదరాబాద్ (31m 30s), చెన్నై(30m 20s), ముంబై(29m 26s), అహ్మదాబాద్ (29m 3s) ఉన్నాయి.