News September 13, 2024

కౌశిక్‌ను బీఆర్ఎస్ నుంచి సస్పెండ్ చేయాలి: ఎమ్మెల్యే దానం

image

TG: BRS MLA కౌశిక్ రెడ్డిని ఆ పార్టీ నేతలు కావాలనే రెచ్చగొడుతున్నారని ఎమ్మెల్యే దానం నాగేందర్ ఆరోపించారు. హరీశ్ రావు కూడా దీనిని ప్రోత్సహించడం కరెక్ట్ కాదని అన్నారు. ‘కౌశిక్ రెడ్డి ప్రాంతీయ విద్వేషాలను రెచ్చగొడుతున్నారు. ఆయన చేసిన వ్యాఖ్యలు వ్యక్తిగతమా? పార్టీ స్టాండా? వ్యక్తిగతమైతే కౌశిక్‌ను పార్టీ నుంచి సస్పెండ్ చేయాలి’ అని మీడియాతో వ్యాఖ్యానించారు.

Similar News

News December 15, 2025

సూర్యకుమార్ చెత్త రికార్డు

image

IND ప్లేయర్ సూర్యకుమార్ T20Iల హిస్టరీలోనే చెత్త రికార్డు నమోదు చేశారు. ఒక క్యాలెండర్ ఇయర్‌లో అత్యల్ప యావరేజ్(14.20)తో <<18568094>>పరుగులు<<>> చేసిన కెప్టెన్‌గా నిలిచారు. ఇతని కంటే ముందు రువాండ కెప్టెన్ క్లింటన్ రుబాగుమ్య(12.52) ఉన్నారు. కానీ ICC టాప్-20 జట్లలో ఆ టీమ్ లేదు. అలాగే ఒక ఏడాదిలో(కనీసం 10 inngs) అత్యల్ప యావరేజ్‌ నమోదుచేసిన రెండో ఇండియన్ బ్యాటర్‌గా SKY నిలిచారు. 2022లో అక్షర్ పటేల్ యావరేజ్ 11.62గా ఉంది.

News December 15, 2025

గ్రామంలో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ.. అభ్యర్థుల హామీకి నవ్వులే!

image

TG: GP ఎన్నికల్లో కొందరి అభ్యర్థుల హామీలు వాస్తవాలకు దూరంగా ఉన్నాయి. ఓటర్లను ఆకర్షించేందుకు ఊరికి సరైన రహదారి లేకపోయినా అండర్‌గ్రౌండ్ డ్రైనేజీ, ఉచిత వైఫై వంటిహామీలను గుప్పిస్తున్నారు. అభివృద్ధి ప్రణాళిక లేని ఈ ఊహాజనిత వాగ్దానాలను నమ్మొద్దని విద్యావేత్తలు సూచిస్తున్నారు. ప్రజలు కేవలం హామీలకు కాకుండా గ్రామాభివృద్ధికి నిజాయతీగా సరైన ప్రణాళికతో కృషి చేసే అభ్యర్థులను ఎన్నుకోవాలని కోరుతున్నారు.

News December 15, 2025

నేటితో ముగియనున్న భవానీ దీక్షల విరమణ

image

AP: విజయవాడ ఇంద్రకీలాద్రిపై భవానీ దీక్షల విరమణ మహోత్సవం ఇవాళ్టితో ముగియనుంది. మరికాసేపట్లో యాగశాలలో మహాపూర్ణాహుతి కార్యక్రమం ప్రారంభం కానుంది. ఈ క్రమంలో తెల్లవారుజాము నుంచి ఇంద్రకీలాద్రికి దీక్షాధారులు భారీగా చేరుకుంటున్నారు. నిన్న ఒక్కరోజే 1.5 లక్షల మంది భక్తులు దుర్గమ్మను దర్శించుకున్నారని అధికారులు తెలిపారు. ఇరుముడిని సమర్పించేందుకు ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేశామని చెప్పారు.