News February 3, 2025
సికింద్రాబాద్లో కవచ్ సెంటర్ ఆఫ్ ఎక్స్లెన్స్: అశ్వినీ వైష్ణవ్

TG: కాజీపేట రైల్వే స్టేషన్ను అభివృద్ధి చేస్తున్నామని కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్ అన్నారు. కొన్ని పనులకు అనుమతులు కావాలని, అందుకే ఆలస్యం అవుతోందని చెప్పారు. ‘సికింద్రాబాద్లో కవచ్ సెంటర్ ఆఫ్ ఎక్స్లెన్స్ ఏర్పాటు చేస్తాం. తెలంగాణలో 1,026 కి.మీ. మేరకు కవచ్ ఏర్పాటు చేస్తున్నాం. రాష్ట్రం నుంచి 5 వందే భారత్ రైళ్లు నడుస్తున్నాయి. అన్ని రైల్వే లైన్ల విద్యుదీకరణ పూర్తయింది’ అని చెప్పారు.
Similar News
News December 26, 2025
జుట్టు రాలకుండా ఉండాలంటే..

మాడుపై సహజంగా నూనెల్ని విడుదల చేసే సెబేషియస్ గ్రంథులు దువ్వినప్పుడు ప్రేరేపితమయ్యి శిరోజాలు ఆరోగ్యంగా పెరుగుతాయి. అందుకే తలస్నానం తర్వాత వెడల్పాటి దువ్వెనతో సున్నితంగా దువ్వడమూ ముఖ్యమే. తల దువ్వినప్పుడు 50-100 వెంట్రుకలు రాలడం సహజమే. అయితే, ఇంతకు మించి ఊడిపోతుంటే మాత్రం అనారోగ్యమో, పోషకాల లోపమో కారణం కావొచ్చు. పైపైన పూతలే కాదు.. సమతులాహారం తీసుకుంటేనే జుట్టు ఆరోగ్యంగా ఉంటుందంటున్నారు నిపుణులు.
News December 26, 2025
యజ్ఞం ఎందుకు చేస్తారు?

యజ్ఞం ద్వారా మనం ప్రకృతి శక్తులకు కృతజ్ఞత తెలుపుతాం. దీన్ని లోకకల్యాణం కోసం చేస్తాం. శాస్త్రీయంగా చూస్తే.. యజ్ఞగుండంలో వాడే హోమ ద్రవ్యాలు, నెయ్యి, సమిధలు కాలి గాలిలోకి విడుదలైనప్పుడు వాతావరణం శుద్ధి అవుతుంది. మంటల నుంచి వెలువడే ఔషధ గుణాలు గల పొగ బ్యాక్టీరియాను నశింపజేసి వర్షాలు కురవడానికి తోడ్పడుతుంది. అలాగే, యజ్ఞంలో పఠించే మంత్రాల ప్రకంపనలు మెదడును ప్రశాంతపరిచి, సానుకూల శక్తిని పెంచుతాయి.
News December 26, 2025
$2టికెట్తో ₹16,153 కోట్లు గెలుచుకున్నాడు!

అమెరికాలోని పవర్బాల్ లాటరీలో ఓ వ్యక్తికి అదృష్టం వరించింది. క్రిస్మస్ ఈవ్ రోజున జరిగిన డ్రాలో ఏకంగా $1.8B (సుమారు రూ.16,153 కోట్లు) జాక్పాట్ తగిలింది. ఈ లాటరీలో ఒక సారి డబ్బులు ఎవరికీ దక్కకపోతే ఆ మొత్తం తరువాత టికెట్లకు యాడ్ అవుతుంది. దీంతో విన్నర్లకు అందే సొమ్ము భారీగా పెరుగుతుంది. గత 3 నెలలుగా ఎవరికీ దక్కని జాక్పాట్ ఓ వ్యక్తికి దక్కింది. కేవలం $2 టికెట్ జీవితాన్ని పూర్తిగా మార్చేసింది.


