News August 24, 2025
HMS గౌరవ అధ్యక్షురాలిగా కవిత?

TG: MLC కవిత హిందూ మజ్దూర్ సభ గౌరవ అధ్యక్షురాలిగా నియమితులయ్యే అవకాశం ఉంది. తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం గౌరవ అధ్యక్షురాలి(TBGKS)గా ఆమె అందించిన సేవలకు గుర్తుగా HMS అధ్యక్షురాలిగా ఎన్నుకోవాలని సంఘం నాయకులు నిర్ణయించారు. AUG 31న మంచిర్యాల(D) శ్రీరాంపూర్‌లో జరిగే సమావేశంలో ఆమెను ఏకగ్రీవంగా ఎన్నుకోనున్నారు. ఇటీవలే TBGKS అధ్యక్షురాలిగా ఉన్న ఆమెను తొలగించి, కొప్పుల ఈశ్వర్‌ను ఎన్నుకున్నారు.
Similar News
News August 24, 2025
OG అప్డేట్.. సెకండ్ సింగిల్ ఎప్పుడంటే?

పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్, ప్రియాంక కాంబోలో సుజీత్ తెరకెక్కిస్తున్న OG మూవీపై మేకర్స్ అప్డేట్ ఇచ్చారు. వినాయక చవితి కానుకగా ఈనెల 27న 10.08AMకు సెకండ్ సింగిల్ రిలీజ్ చేయనున్నట్లు తెలిపారు. ‘సువ్వీ సువ్వీ’ అంటూ సాగే సాంగ్ మిమ్మల్ని గెలుస్తుంది అంటూ స్పెషల్ పోస్టర్ షేర్ చేశారు. ఇప్పటికే రిలీజైన ఫస్ట్ సింగిల్‌కు అదిరిపోయే రెస్పాన్స్ వచ్చిన విషయం తెలిసిందే. కాగా ఈ చిత్రం SEP 25న విడుదల కానుంది.
News August 24, 2025
త్వరలోనే బాధ్యులపై చర్యలు: మంత్రి రాంప్రసాద్

AP: ‘ఆడుదాం ఆంధ్రా’పై విచారణ పూర్తయిందని మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి తెలిపారు. బాధ్యులపై త్వరలోనే చర్యలు తీసుకుంటామన్నారు. దేశంలోనే క్రమశిక్షణ కలిగిన పార్టీ టీడీపీ అని ఆయన వివరించారు. ఎవరు తప్పు చేసినా చర్యలు తీసుకుంటామని చెప్పారు. పార్టీలో అందరూ సమానమే అని పేర్కొన్నారు. తిరుపతిలో అమరావతి ఛాంపియన్‌షిప్ పోటీల ప్రారంభోత్సవంలో ఆయన పాల్గొన్నారు.
News August 24, 2025
సౌతాఫ్రికా చరిత్రలోనే ఘోర వన్డే ఓటమి

ఆస్ట్రేలియాతో జరిగిన మూడో వన్డేలో సౌతాఫ్రికా ఘోర ఓటమిని చవిచూసింది. తొలుత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా 431 రన్స్ చేసింది. ఛేదనలో SA 155 రన్స్‌కే ఆలౌటైంది. దీంతో 276 రన్స్ తేడాతో ఓడిపోయింది. రన్స్ పరంగా వన్డేల్లో ఇది సౌతాఫ్రికాకు అతిపెద్ద ఓటమి. అంతకుముందు 2023 వరల్డ్‌కప్‌లో భారత్ చేతిలో 243 రన్స్ తేడాతో ఓడింది. కాగా AUSపై తొలి రెండు మ్యాచ్‌ల్లో గెలిచిన సౌతాఫ్రికా 2-1తో సిరీస్‌ను సొంతం చేసుకుంది.