News August 27, 2024

ఊహించినట్లే కవితకు బెయిల్

image

BRS శ్రేణులు ఊహించినట్లే MLC కవితకు బెయిల్ వచ్చింది. ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో మార్చి 15న అరెస్టైన ఆమె పలుమార్లు బెయిల్ కోసం ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. దీంతో ఈసారి పకడ్బందీగా వాదనలు వినిపించాలని బీఆర్ఎస్ నిర్ణయించింది. ఈమేరకు కేటీఆర్, హరీశ్ రావు ఢిల్లీ వెళ్లి న్యాయనిపుణులతో సంప్రదింపులు జరిపారు. కేసులో కవితకు వ్యతిరేకంగా ఈడీ ఎలాంటి ఆధారాలు చూపలేదని ఆమె లాయర్ వాదించి సక్సెస్ అయ్యారు.

Similar News

News March 22, 2026

TDR పాలసీలో కీలక మార్పులు

image

TG: భవన నిర్మాణాల్లో ట్రాన్స్‌ఫరేబుల్ డెవలప్‌మెంట్ రైట్స్(TDR) వినియోగానికి సంబంధించి ప్రభుత్వం కొత్త జీవో జారీ చేసింది. 21mకు పైబడిన భవనాలను హై-రైజ్ భవనాలుగా గుర్తించనుంది. 750-2000చ.మీ ప్లాట్లలో 18-21m భవనాలకు TDR తప్పనిసరి చేసింది. నాన్ హై రైజ్ బిల్డింగ్స్‌కు సెట్ బ్యాక్ సడలించింది. హై రైజ్ భవనాల్లో 10% వరకు సెట్ బ్యాక్ రిలాక్షేషన్‌కు, 2000 చ.మీ ప్లాట్లలో అదనపు అంతస్తులకు అవకాశం కల్పించింది.

News March 22, 2026

జనసేన MLA బాలరాజుకు రూ.12లక్షలు టోకరా

image

AP: పోలవరం జనసేన MLA చిర్రి బాలరాజుకు సైబర్ నేరగాళ్లు టోకరా వేశారు. ఆర్టీఏ చలానా పేరుతో ఓ లింక్ పంపారు. దాన్ని క్లిక్ చేయగానే ఆయన ఖాతా నుంచి రూ.12లక్షలను మాయం చేశారు. మోసపోయినట్లు గుర్తించిన MLA వెంటనే జీలుగుమల్లి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఇక SMలో షేర్ అయ్యే APK ఫైళ్లు, లింక్‌ల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని డీజీపీ హరీశ్ కుమార్ గుప్తా ఇప్పటికే హెచ్చరించారు.

News March 22, 2026

మూడో రోజే ₹500 కోట్ల క్లబ్‌లోకి ధురంధర్-2

image

రణవీర్ సింగ్ హీరోగా ఆదిత్య ధర్ డైరెక్షన్‌లో వచ్చిన ‘ధురంధర్ 2’ బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. Sacnilk ప్రకారం ఈ సినిమా కేవలం 3 రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా ₹500 కోట్ల గ్రాస్ మైల్‌స్టోన్‌ని దాటింది. ఇండియాలో ₹339 కోట్ల నెట్ కలెక్షన్లు సాధించగా ఓవర్సీస్ మార్కెట్‌లో ₹96 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసింది. స్పై థ్రిల్లర్ జోనర్‌లో వచ్చిన ఈ సినిమాకు భారీ ఆక్యుపెన్సీ లభిస్తోంది.