News July 15, 2024

కవితకు మరోసారి నిరాశ

image

TG: ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో బీఆర్ఎస్ MLC కవితకు మరోసారి నిరాశ ఎదురైంది. సీబీఐ కేసులో కవిత జుడీషియల్ కస్టడీని జులై 22కు పొడిగిస్తూ రౌస్ అవెన్యూ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. కేసు తదుపరి విచారణను కూడా అదే తేదీకి వాయిదా వేసింది.

Similar News

News January 19, 2026

పంతం పక్కనబెట్టి ఈ పనులు నేర్చుకోండోయ్!

image

నగరాలు, పట్టణాల్లో ప్లంబర్లు, ఎలక్ట్రీషియన్లకు విపరీతమైన <<18865388>>డిమాండ్<<>> నెలకొంది. చిన్నపని చేసినా రూ.500-1,000 వరకు తీసుకుంటున్నారు. అయితే ఇంత డిమాండ్ ఉన్నప్పటికీ నిరుద్యోగులు ఆ పనులు చేసేందుకు ఇష్టపడట్లేదు. సొసైటీలో తమ హోదా తగ్గుతుందని, వైట్ కాలర్ జాబ్స్ మాత్రమే చేస్తామంటున్నారు. ఆ పంతం పక్కనబెట్టి స్కిల్స్ నేర్చుకుంటే సాఫ్ట్‌వేర్ జాబ్ కంటే ఎక్కువ సంపాదించవచ్చని నిపుణుల మాట. ఏమంటారు?

News January 19, 2026

బ్యాంక్ ఆఫ్ బరోడాలో ఉద్యోగాలకు నోటిఫికేషన్

image

<>బ్యాంక్<<>> ఆఫ్ బరోడా 4 ప్రొఫెషనల్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. డిగ్రీ/పీజీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం గల అభ్యర్థులు ఫిబ్రవరి 6 వరకు అప్లై చేసుకోవచ్చు. షార్ట్ లిస్టింగ్, రాత పరీక్ష, సైకోమెట్రిక్ టెస్ట్, ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. దరఖాస్తు ఫీజు రూ.850, SC, ST, PwBDలకు రూ.175. వెబ్‌సైట్: https://bankofbaroda.bank.in

News January 19, 2026

బొగ్గు టెండర్ల పంచాయితీ.. నివేదిక కోరిన కేంద్రం!

image

ఒడిశాలోని నైనీ కోల్ బ్లాక్ టెండర్ల వ్యవహారంపై కేంద్ర బొగ్గు శాఖ తెలంగాణ ప్రభుత్వం నుంచి నివేదిక కోరింది. పాలసీ పరమైన లోపాలు జరిగినట్లు సమాచారం అందడంతో టెండర్ల ప్రక్రియ వివరాలు సమర్పించాలని సింగరేణిని కోరింది. సింగరేణిలో బొగ్గు మంత్రిత్వ శాఖకు 49%, తెలంగాణ ప్రభుత్వానికి 51% వాటా ఉంది. బొగ్గు శాఖ నైనీ బ్లాకులను ఎస్సీసీఎల్‌కు కేటాయించగా, తెలంగాణ ప్రభుత్వం 2025లో టెండర్ల ప్రక్రియను ప్రారంభించింది.