News March 16, 2024
కవిత అరెస్ట్ ఒక నాటకం: సీఎం రేవంత్

TG: ఎమ్మెల్సీ కవిత అరెస్ట్ BJP, BRS కలిసి ఆడుతున్న నాటకమని సీఎం రేవంత్ అన్నారు. లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్‌ను దెబ్బ తీసేందుకు ఈ డ్రామా ఆడుతున్నారని ఆరోపించారు. ‘కవిత అరెస్టును కేసీఆర్ ఖండించలేదు. PM మోదీ కూడా దీనిపై ఏం మాట్లాడట్లేదు. వారిద్దరి మౌనం వెనుక ఏదో వ్యూహం ఉంది. ఓట్ల కోసమే ఇలా చేస్తున్నారు. గతంలో ఈడీ వచ్చాక మోదీ వచ్చేవారు. నిన్న మాత్రం మోదీ, ఈడీ కలిసే వచ్చారు’ అని వ్యాఖ్యానించారు.
Similar News
News March 7, 2026
మెదడును చురుగ్గా పనిచేయించే ‘కోకో’

కోకో తీసుకోవడం వల్ల మెదడు పనితీరు మెరుగుపడుతుందని జపాన్ శాస్త్రవేత్తలు గుర్తించారు. దీనిలోని ఫ్లావనాల్స్ రక్త ప్రసరణను మెరుగుపరిచి, మెదడుకు ఆక్సిజన్‌ను అందిస్తాయి. ఫలితంగా ఏకాగ్రత పెరగడం, వేగంగా నిర్ణయాలు తీసుకోవడం, మానసిక అలసట తగ్గుతుందని పేర్కొన్నారు. రోజుకు 3 చెంచాల కోకో పౌడర్‌ను పాలు/ నీటిలో కలుపుకుని తాగితే మెదడు మరింత చురుగ్గా మారుతుందని సూచిస్తున్నారు. డార్క్ చాక్లెట్‌లోనూ కోకో ఉంటుంది.
News March 7, 2026
ఇరాన్‌లో మరోసారి భూకంపం

US, ఇజ్రాయెల్ దాడులతో అట్టుడుకుతున్న ఇరాన్‌లో మరోసారి భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై 4.1 తీవ్రత నమోదైంది. బందర్ అబ్బాస్‌కు 74 కిలోమీటర్ల దూరంలో, భూమికి 10 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రం ఉన్నట్లు US జియోలాజికల్ సర్వే తెలిపింది. ఈనెల 3న కూడా గెరాష్ నగర సమీపంలో రిక్టర్ స్కేలుపై 4.3 తీవ్రతతో <<19288652>>భూకంపం సంభవించడం<<>> తెలిసిందే.
News March 7, 2026
హైదరాబాద్‌కు నెట్‌ఫ్లిక్స్

ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ నెట్‌ఫ్లిక్స్ హైదరాబాద్‌లో కార్యాలయం ఏర్పాటు చేయనుంది. 30వేల చ.అడుగుల ఈ ఆఫీస్‌ను సీఎం రేవంత్ రెడ్డి, ఐటీ మినిస్టర్ శ్రీధర్ బాబు ఈ నెల 12న ప్రారంభించనున్నారు. నెట్‌ఫ్లిక్స్‌కు ఇప్పటికే ముంబైలో కార్యాలయం ఉండగా భారత్‌లో ఇది రెండోది కానుంది. ఓటీటీ ప్లాట్‌ఫామ్ రాకతో HYDలో యానిమేషన్, విజువల్ ఎఫెక్ట్స్, గేమింగ్ అండ్ కామిక్స్ సెక్టార్లు బలోపేతం అవుతాయని ప్రభుత్వం భావిస్తోంది.


