News March 16, 2024

కవిత అరెస్టు: INDIA కూటమి మద్దతిస్తుందా?

image

EDని అడ్డుపెట్టుకొని కేంద్రంలోని BJP ప్రతిపక్ష నేతలను అరెస్టులతో వేధిస్తోందని ఆరోపణలున్నాయి. తాజాగా BRS ఎమ్మెల్సీ కవితను ED అరెస్ట్ చేసింది. దీంతో కేంద్రంలో BJPని వ్యతిరేకించే INDIA కూటమి KCR కుటుంబానికి మద్దతిస్తుందా? అనే చర్చ మొదలైంది. అయితే.. రాష్ట్రంలో BRS, కాంగ్రెస్ మధ్య పొలిటికల్ వార్‌ తారస్థాయికి చేరింది. దీంతో INDIA కూటమి BRSకు మద్దతిచ్చే అవకాశం లేదని కొందరు అంటున్నారు. మీ అభిప్రాయం ఏంటి?

Similar News

News November 28, 2025

వర్ని: సర్పంచ్ ఎలక్షన్స్.. రెండు చోట్ల ఏకగ్రీవ తీర్మానం

image

నిజామాబాద్ జిల్లా వర్ని మండలంలోని సిద్దాపూర్ తండా, చెలక తండా గ్రామపంచాయతీల సర్పంచ్ ఎన్నికల్లో ఒక్కొక్కరే నామినేషన్ వేయాలని స్థానికులు తీర్మానం చేశారు. గ్రామాల అభివృద్ధికి, ఐక్యతకు నిదర్శనంగా ఏకగ్రీవంగా ఎన్నికలు చేసుకోవాలని తీర్మానించారు. సిద్దాపూర్ సర్పంచ్‌ అభ్యర్థిగా బాల్‌సింగ్, చెలక తండా సర్పంచ్‌ అభ్యర్థిగా గంగారాం మాత్రమే నామినేషన్లు దాఖలు చేయాలని వారు నిర్ణయించుకున్నారు.

News November 28, 2025

ఏపీ న్యూస్ రౌండప్

image

* రోడ్ల మరమ్మతుల కోసం రూ.276 కోట్ల నిధుల విడుదలకు ప్రభుత్వం పరిపాలనా అనుమతి ఇచ్చింది.
* ఎంప్లాయీస్ హెల్త్ కార్డ్ స్కీమ్ నిర్వహణలో లోపాలను పరిష్కరించడానికి CS విజయానంద్ నేతృత్వంలో కమిటీ ఏర్పాటైంది.
* IRS అధికారి జాస్తి కృష్ణకిశోర్‌పై గతంలో CID నమోదుచేసిన అభియోగాలను ప్రభుత్వం ఉపసంహరించుకుంది.
* వర్షాలకు ధాన్యం తడిచి రైతులు తక్కువ ధరకు అమ్ముకున్నారనే కంప్లైంట్‌లు వస్తే JCలదే బాధ్యత: CS విజయానంద్

News November 28, 2025

సర్పంచ్ పోస్టు@రూ.కోటి

image

TG: సర్పంచ్ పదవులను <<18400001>>ఏకగ్రీవంగా<<>> సొంతం చేసుకునేందుకు వేలంపాటలు జోరుగా సాగుతున్నాయి. మహబూబ్‌నగర్(D) టంకర్ గ్రామ పంచాయతీని ఓ వ్యాపారి ₹కోటికి దక్కించుకున్నారు. ఆంజనేయస్వామి ఆలయానికి నిధులు ఖర్చు చేసేలా ఒప్పందం చేసుకున్నారు. గద్వాల(D) కొండపల్లిలో ₹60L, గొర్లఖాన్‌దొడ్డిలో ₹57L, చింతలకుంటలో ₹38L, ముచ్చోనిపల్లిలో రూ.14.90L, ఉమిత్యాల తండాలో ₹12L చొప్పున సర్పంచ్ సీటుకు వేలంపాట పాడారు.