News April 4, 2024

కవిత బెయిల్‌పై సోమవారం తీర్పు

image

ఎమ్మెల్సీ కవిత మధ్యంతర బెయిల్‌పై తీర్పును కోర్టు రిజర్వ్ చేసింది. సోమవారం ఉ.10.30 గంటలకు తీర్పు వెల్లడిస్తామని రౌస్ అవెన్యూ కోర్టు తెలిపింది. కుమారుడికి పరీక్షలు ఉన్నాయని కవిత బెయిల్ అడగడం మానవతా కోణంలోకి రాదని ఈడీ కోర్టులో వాదించింది. కుమారుడిని చూసుకునేందుకు చాలా మంది ఉన్నారని, ఇప్పటికే కొన్ని పరీక్షలు అయిపోయాయని పేర్కొంది. అటు సాధారణ బెయిల్ విచారణను ఏప్రిల్ 20న చేపడతామని కోర్టు తెలిపింది.

Similar News

News February 1, 2026

నందినగర్‌కు చేరుకున్న కేసీఆర్

image

TG: కాసేపట్లో సిట్ విచారణ నేపథ్యంలో మాజీ సీఎం కేసీఆర్ నందినగర్‌లోని నివాసానికి చేరుకున్నారు. ఇప్పటికే అక్కడికి చేరుకున్న పోలీసులు విచారణ గదిని పరిశీలించారు. ఇంటి చుట్టూ భారీ భద్రత ఏర్పాటుచేశారు. మరోవైపు కేసీఆర్‌కు సిట్ నోటీసులపై రాష్ట్రవ్యాప్తంగా బీఆర్ఎస్ శ్రేణులు ఆందోళనలు చేస్తున్నాయి.

News February 1, 2026

TAX: ఆశించిందొకటి.. ఇచ్చింది మరొకటి!

image

ట్రేడర్లు ఊహించిందొకటైతే నిర్మలమ్మ ఇచ్చింది మరొకటి. షేర్స్, ఫ్యూచర్స్, ఆప్షన్స్ కొనేటప్పుడు వేసే సెక్యూరిటీ ట్రాన్జాక్షన్స్ ట్యాక్స్‌ (STT)ను తగ్గిస్తారని ఆశించారు. ఆప్షన్స్‌పై 0.1 నుంచి 0.15%, ఫ్యూచర్స్‌పై 0.05 శాతానికి పన్ను పెంచడంతో ఉసూరుమంటున్నారు. ఉద్రేకంతో అమ్మకాలు చేపట్టడంతో సూచీలు కుదేలయ్యాయి. అనిశ్చితి, రాబోయే సంక్షోభాన్ని ఊహించి స్పెక్యులేషన్ నివారించేందుకే ఇలా చేసినట్టు తెలుస్తోంది.

News February 1, 2026

సముద్ర స్నానంతో ఆరోగ్యమెలా?

image

నదులన్నీ సముద్రంలోనే కలుస్తాయి. అందుకే సముద్రంలో స్నానం చేయడం వల్ల సకల నదులలో స్నానం చేసిన పుణ్యఫలం దక్కుతుందని పురాణాలు చెబుతున్నాయి. సముద్రుడి అనుగ్రహంతో సంపూర్ణ ఆరోగ్యం లభిస్తుందని నమ్మకం. ఒకవేళ సముద్రం లేదా నదులు అందుబాటులో లేకపోతే, బావుల వద్ద స్నానం చేసేటప్పుడు గంగ, యమున, కావేరి వంటి పవిత్ర నదుల పేర్లను భక్తితో స్మరిస్తే అదే ఫలితం కలుగుతుందని పద్మపురాణం వివరిస్తోంది.