News April 11, 2024

కవితకు నిరాశ

image

TG: ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో కవితను సీబీఐ అరెస్ట్ చేయడంపై అత్యవసర విచారణ చేయాలని ఆమె లాయర్ సీబీఐ స్పెషల్ కోర్టులో పిటిషన్ వేశారు. ఈ కేసులో తక్షణం ఎలాంటి ఉపశమనం ఇవ్వలేమని ప్రత్యేక జడ్జి మనోజ్ కుమార్ తెలిపారు. కేసు గురించి తనకు ఎలాంటి విషయాలు తెలియవన్న జడ్జి.. తన ఎదుట అత్యవసర తీర్పులపైనే వాదనలు జరుగుతాయన్నారు. రేపు రెగ్యులర్ కోర్టులో పిటిషన్ వేయాలని కవిత తరఫు లాయర్‌కు సూచించారు.

Similar News

News December 5, 2025

TG న్యూస్ రౌండప్

image

* కేంద్రం తీసుకొచ్చిన లేబర్ కోడ్స్‌పై అభిప్రాయాలు సేకరించేందుకు రేపు తెలంగాణ భవన్‌లో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహిస్తున్నాం. దీనికి KTR హాజరవుతారు: బోయినపల్లి వినోద్
* కాళోజీ నారాయణరావు యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ ఇన్‌ఛార్జ్ VCగా డా.రమేష్ రెడ్డిని ప్రభుత్వం నియమించింది.
* HYD శామీర్‌పేటలో ఓ కారు టైర్లు, సీట్ల కింద ₹4Cr నగదును పోలీసులు గుర్తించారు. హవాలా ముఠాను అరెస్టు చేసి విచారిస్తున్నారు.

News December 5, 2025

గాంధీ చూపిన మార్గమే స్ఫూర్తి: పుతిన్

image

భారత్-రష్యా బలమైన బంధానికి గాంధీ చూపిన అహింసా మార్గమే స్ఫూర్తి అని రాజ్‌ఘాట్ సందర్శకుల పుస్తకంలో రష్యా ప్రెసిడెంట్ పుతిన్ రాసుకొచ్చారు. శాంతి, అభివృద్ధికి ఆయన చూపిన మార్గం భవిష్యత్తు తరాలను ఇన్‌స్పైర్ చేస్తూనే ఉంటుందన్నారు. జీవితాన్ని భారతదేశ స్వాతంత్ర్య పోరాటానికి అంకితం చేశారని, అహింసకు చిహ్నంగా మారారని రాశారు. ద్వైపాక్షిక వాణిజ్యం, దౌత్య సంబంధాలపై చర్చించడానికి పుతిన్ భారత పర్యటనకు వచ్చారు.

News December 5, 2025

భారీగా పెరిగిన విమాన టికెట్ ధరలు

image

ఇండిగో విమానాలు <<18473431>>రద్దు<<>> కావడంతో మిగతా ఎయిర్‌లైన్స్ ఈ సందర్భాన్ని ‘క్యాష్’ చేసుకుంటున్నాయి. వివిధ రూట్లలో టికెట్ ధరలను భారీగా పెంచాయి. హైదరాబాద్-ఢిల్లీ ఫ్లైట్ టికెట్ రేట్ రూ.40వేలకు చేరింది. హైదరాబాద్-ముంబైకి రూ.37వేలుగా ఉంది. సాధారణంగా ఈ రూట్ల టికెట్ ధరలు రూ.6000-7000 మధ్య ఉంటాయి. అటు ఢిల్లీలో హోటల్ గదుల రేట్లు కూడా అమాంతం పెరిగిపోవడంతో ప్రయాణికులు గగ్గోలు పెడుతున్నారు.