News August 20, 2024
కవిత బెయిల్ పిటిషన్: విచారణ వాయిదా

ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో ఎమ్మెల్సీ కవిత బెయిల్ పిటిషన్పై సుప్రీంకోర్టులో విచారణ వాయిదా పడింది. వచ్చే మంగళవారం విచారణ చేపడతామని కోర్టు పేర్కొంది. ఈ కేసులో సీబీఐ కౌంటర్ దాఖలు చేయగా, ఈడీ సమయం కోరింది. కోర్టు ఈడీకి ఈ నెల 23 వరకు అవకాశం ఇచ్చింది. కాగా, ఢిల్లీ హైకోర్టు తన బెయిల్ తిరస్కరించడంతో కవిత సుప్రీంకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే.
Similar News
News October 15, 2025
నారాయణపేట: లేబర్ కార్డులు అందివ్వాలి: CITU

నారాయణపేటలో భవన నిర్మాణ కార్మికులు గుర్తింపు కార్డుల కోసం దరఖాస్తులు అందించారు. అర్హులైన కార్మికులు తెలంగాణ భవన నిర్మాణ సంక్షేమ బోర్డు గుర్తింపు కార్డులు తప్పనిసరిగా పొందాలని సీఐటీయూ నాయకులు బాల్రామ్, పుంజనూరు ఆంజనేయులు పిలుపునిచ్చారు. కార్డు ఉన్న వారికి పెళ్లి, కాన్పు, మరణం వంటి సందర్భాల్లో ఆర్థిక సహాయం లభిస్తుందని అధికారులు తెలిపారు.
News October 15, 2025
జోగి రమేశ్ అరెస్టుకు రంగం సిద్ధం?

AP: కల్తీ మద్యం కేసులో మాజీ మంత్రి <<17996336>>జోగి రమేశ్<<>> అరెస్టుకు రంగం సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. కల్తీ మద్యం తయారీకి ప్రోత్సహించింది రమేశే అని A-1 జనార్దన్ రావు చెప్పడంతో ఎక్సైజ్ అధికారులు ఆధారాలు సేకరిస్తున్నారు. మద్యం పట్టుబడిన ANR గోడౌన్ పరిసరాల సీసీ ఫుటేజిని పరిశీలించారు. కాగా జనార్దన్ రావుతో తనకు సత్సంబంధాలు ఉన్నాయని నిరూపిస్తే ఎలాంటి శిక్షకైనా సిద్ధమని జోగి రమేశ్ స్పష్టం చేశారు.
News October 15, 2025
ఏపీ మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖలో ఉద్యోగాలు

ఏపీ మహిళాభివృద్ధి శిశు సంక్షేమ శాఖ, ఎన్టీఆర్ జిల్లా నుంచి 20 కాంట్రాక్ట్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదలైంది. అర్హతగల అభ్యర్థులు ఈ నెల 22 వరకు ఆఫ్లైన్ ద్వారా అప్లై చేసుకోవచ్చు. పోస్టును బట్టి టెన్త్, ఇంటర్, డిగ్రీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. అభ్యర్థుల వయసు 18 నుంచి 42ఏళ్ల మధ్య ఉండాలి. షార్ట్ లిస్ట్, ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. వెబ్సైట్: https://ntr.ap.gov.in/