News September 3, 2025

కవిత KCR విడిచిన బాణం కావొచ్చు: మహేశ్ గౌడ్

image

TG: అవినీతిపై ప్రజల దృష్టిని మళ్లించడానికి కేసీఆర్ విడిచిన బాణం <<17599925>>కవిత<<>> కావొచ్చని టీపీసీసీ చీఫ్ మహేశ్ గౌడ్ ఎద్దేవా చేశారు. కేటీఆర్‌పై కవిత స్టాండ్ ఎందుకు మారిందో అర్థం కావడం లేదన్నారు. బాణం హరీశ్ రావు వైపు ఎందుకు తిరిగిందో తెలియడం లేదని సెటైర్లు వేశారు. ఇవాళ కవిత కొన్ని సత్యాలు, అసత్యాలు మాట్లాడారని అన్నారు. ఆమెకు తెలియకుండానే బీఆర్ఎస్ హయాంలో అవినీతి జరిగిందా అని ప్రశ్నించారు.

Similar News

News September 5, 2025

ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల రీసర్వే!

image

TG: రాష్ట్ర ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల రీసర్వే చేపట్టింది. కేంద్ర ప్రభుత్వ వాటా కింద PM ఆవాస్ యోజన నిధులు విడుదల అయ్యేందుకు క్షేత్రస్థాయిలో ఈ ప్రక్రియ మొదలుపెట్టింది. గ్రామాల్లో ఇప్పటికే ఇళ్ల నిర్మాణం చేపట్టిన వారి వివరాలను పంచాయతీ కార్యదర్శులు మళ్లీ సేకరిస్తున్నారు. దాదాపు 60 ప్రశ్నలకు సమాధానాలను యాప్‌లో ఎంటర్ చేస్తున్నారు. ఇందుకు ఈనెల 9 వరకు డెడ్‌లైన్ విధించినట్లు తెలుస్తోంది.

News September 5, 2025

నేడు విశాఖ, విజయవాడలో పర్యటించనున్న CM

image

AP: సీఎం చంద్రబాబు ఇవాళ విశాఖలో పర్యటించనున్నారు. ఉదయం విశాఖ నగరానికి చేరుకుని అక్కడ ఇంటర్నేషనల్ మీడియేషన్ కాన్ఫరెన్స్‌కు హాజరుకానున్నారు. పర్యటన అనంతరం మధ్యాహ్నం విశాఖ నుంచి బయలుదేరి ఉండవల్లిలోని నివాసానికి సీఎం చేరుకుంటారు. ఆ తర్వాత సాయంత్రం విజయవాడలో జరిగే ఉపాధ్యాయ దినోత్సవంలో పాల్గొంటారు.

News September 5, 2025

వినాయక నిమజ్జనానికి సర్వం సిద్ధం

image

TG: HYDలో రేపు జరిగే వినాయక నిమజ్జనానికి అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. 50 వేల విగ్రహాలతో 303KM మేర శోభాయాత్రలు కొనసాగుతాయని అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలో 30 వేల మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేయనున్నారు. 20 చెరువులు, 72 కృత్రిమ కొలనుల వద్ద 134 క్రేన్లు, 259 మొబైల్‌ క్రేన్లు సిద్ధం చేశారు. హుస్సేన్‌సాగర్‌లో 9 బోట్లు, 200 మంది గజ ఈతగాళ్లు, 14,486 మంది శానిటేషన్ సిబ్బందిని నియమించారు.