News August 27, 2024
కవితకు బెయిల్ పొందే అర్హత ఉంది: రోహత్గీ

బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత బెయిల్ పిటిషన్‌పై సుప్రీంకోర్టులో ముకుల్ రోహత్గీ వాదనలు వినిపిస్తున్నారు. ‘ఈడీ కేసులో ఆమె 5 నెలలుగా జైలులో ఉన్నారు. ఢిల్లీ లిక్కర్ పాలసీలో రూ.100 కోట్లు చేతులు మారాయన్నది ఆరోపణ మాత్రమే. కేసులో 493 మంది సాక్షులను విచారించారు. కవిత ఎవరినీ బెదిరించలేదు. ఆమె దేశం విడిచి వెళ్లే అవకాశమే లేదు. కవితకు బెయిల్ పొందే అర్హత ఉంది’ అని వాదించారు.
Similar News
News March 4, 2026
సౌతాఫ్రికాతో సెమీస్.. టాస్ గెలిచిన NZ

T20WC: కోల్‌కతాలో జరగనున్న తొలి సెమీఫైనల్లో న్యూజిలాండ్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది.
సౌతాఫ్రికా: మార్క్రమ్ (C), డికాక్, రికెల్టన్, బ్రెవిస్, మిల్లర్, స్టబ్స్, రబాడ, జాన్సెన్, కేశవ్ మహరాజ్, బాష్, లుంగి ఎంగిడి.
న్యూజిలాండ్: సీఫర్ట్, అలెన్, రచిన్ రవీంద్ర, గ్లెన్ ఫిలిప్స్, చాప్‌మన్, మిచెల్, నీషమ్, శాంట్నర్ (C), మెక్‌కొంచి, హెన్రీ, ఫెర్గ్యూసన్.
News March 4, 2026
30,588 ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చాం: సీఎం

AP: వైసీపీ హయాంలో జాకీ, లులు, అమర్‌రాజా, ఫ్రాంక్లిన్ టెంపుల్‌టన్ వంటి అనేక కంపెనీలను తరిమేశారని సీఎం చంద్రబాబు అసెంబ్లీలో ఆరోపించారు. కూటమి అధికారంలోకి వచ్చాక అనేక సంస్థలు రాష్ట్రానికి వస్తున్నాయన్నారు. ‘మేం 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని మాట ఇచ్చాం. ఆ దిశగా చర్యలు తీసుకుంటున్నాం. ఇప్పటికే 30,588 ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చాం. పరిశ్రమలు, సంస్థల్లో 6.28 లక్షల మందికి ఉద్యోగాలు వచ్చాయి’ అని తెలిపారు.
News March 4, 2026
మావోయిస్టు అగ్రనేత గణపతి లొంగుబాటు?

మావోయిస్టు అగ్రనేత ముప్పాళ్ల లక్ష్మణరావు అలియాస్ గణపతి లొంగిపోతున్నట్లు సమాచారం. ఢిల్లీ వెళ్లిన TG CM రేవంత్ ఎదుట లొంగిపోనుండగా కేంద్రానికి ఆయనను CM అప్పగిస్తారని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. సారంగపూర్ (జగిత్యాల) వాసి గణపతి దశాబ్దాలుగా ఉద్యమంలో ఉన్నారు. అడవి పార్టీలన్నీ ఒకటై మావోయిస్టు పార్టీగా ఏర్పడ్డాక ఈయన తొలి ప్రధాన కార్యదర్శిగా పనిచేశారు. కొంతకాలంగా ఈయన నేపాల్‌లో ఉన్నట్లు ప్రచారం జరిగింది.


