News June 24, 2024
100 రోజులుగా జైల్లోనే కవిత

ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో అరెస్టైన BRS ఎమ్మెల్సీ కవిత 100 రోజులుగా తిహార్ జైల్లో ఉంటున్నారు. మార్చి 15న ఈడీ అధికారులు కవితను అరెస్టు చేశారు. ఆ మరుసటి రోజు రౌస్ అవెన్యూ కోర్టు కస్టడీ విధించింది. కవితకు బెయిల్ కోసం ఆమె తరఫు లాయర్లు అనేక ప్రయత్నాలు చేసినా.. ఈడీ ఎప్పటికప్పుడు కోర్టుకు అన్ని ఆధారాలు సమర్పిస్తోంది. పలుమార్లు బెయిల్ పిటిషన్లపై విచారణ జరిపిన ఢిల్లీ హైకోర్టు తీర్పును రిజర్వ్ చేసింది.
Similar News
News December 3, 2025
798 సర్పంచ్, 3465 మంది వార్డు మెంబర్లుగా నామినేషన్

భద్రాద్రి: రెండవ విడత గ్రామపంచాయతీ ఎన్నికల కోసం 7 మండలాల నుంచి నామినేషన్లు స్వీకరించారు. చివరి రోజు ముగిసేనాటికి మొత్తం 155 గ్రామపంచాయతీలకు గాను 798 మంది సర్పంచ్, 1384 వార్డులకు గాను 3465 మంది వార్డు సభ్యులుగా నామినేషన్ దాఖలు చేశారని కలెక్టర్ జితేష్ వి పాటిల్ తెలిపారు. (రెండో విడతలోని మండలాలు: అన్నపురెడ్డిపల్లి, అశ్వరావుపేట, చండ్రుగొండ, చుంచుపల్లి, దమ్మపేట, ములకలపల్లి, పాల్వంచ)
News December 3, 2025
మరో మైలురాయికి చేరువలో రోహిత్ శర్మ

టీమ్‌ఇండియా స్టార్ బ్యాటర్ రోహిత్ శర్మ మరో అరుదైన మైలురాయికి చేరువలో ఉన్నారు. మరో 41 రన్స్ చేస్తే అంతర్జాతీయ క్రికెట్‌లో 20వేల పరుగులు చేసిన 4వ భారత బ్యాటర్‌గా అవతరించనున్నారు. 503 మ్యాచ్‌లలో 42.46 సగటు, 50 సెంచరీలు, 110 హాఫ్ సెంచరీలతో 19,959 పరుగులు చేశారు. సచిన్ 34,357, కోహ్లీ 27,808, ద్రవిడ్ 24,064 రన్స్‌తో మొదటి 3 స్థానాల్లో ఉన్నారు. కాగా సౌతాఫ్రికా, భారత్ మధ్య నేడు 2వ వన్డే జరగనుంది.
News December 3, 2025
4G బుల్లెట్ సూపర్ నేపియర్ పశుగ్రాసం ప్రత్యేకత

4G బుల్లెట్ సూపర్ నేపియర్ పశుగ్రాసాన్ని అన్ని రకాల నేలల్లో కొద్ది నీటి వసతితో పెంచవచ్చు. ఇది ఏడాదికి 6-7 సార్లు కోతకు వస్తుంది. దీనిలో తీపిదనం ఎక్కువగా ఉండటం వల్ల పశువులు ఇష్టంగా తింటాయి. ఎకరం గడ్డి 10 ఆవులకు సరిపోతుంది. దీనిలో ప్రొటీన్ కంటెంట్ 16-18 శాతంగా ఉంటుంది. ఫైబర్ కూడా ఎక్కువ. దీని వల్ల పశువుల్లో పాల ఉత్పత్తి మరింత పెరుగుతుంది. దీని ఆకులు మృదువుగా ఉండటం వల్ల రైతులు కోయడం కూడా సులభం.


