News August 27, 2024
రాత్రి 7 గంటలకు జైలు నుంచి కవిత విడుదల

సుప్రీంకోర్టు బెయిల్ ఇచ్చిన నేపథ్యంలో ఎమ్మెల్సీ కవిత రిలీజ్ ఆర్డర్‌ను ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టు జారీ చేసింది. ట్రయల్ కోర్టులో ఆమె భర్త అనిల్, ఎంపీ రవిచంద్ర షూరిటీ పత్రాలు సమర్పించారు. ఇవాళ రాత్రి 7 గంటలకు జైలు నుంచి కవిత విడుదల కానున్నారు.
Similar News
News February 9, 2026
కిరాణాషాపులకు దెబ్బ?

ఇప్పటివరకు మెట్రో సిటీలకే పరిమితమైన క్విక్ కామర్స్ రంగం టైర్ 3/4 నగరాలకు వచ్చేసింది. ఇండియాలోని 200 నగరాల్లో బ్లింకిట్ సేవలు అందుబాటులోకి వచ్చాయి. దీంతో రాబోయే ఐదేళ్లలో భారీగా కిరాణా దుకాణాలు మూతపడే అవకాశం ఉందని వ్యాపార విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. అయితే 10 ని. డెలివరీ ప్రభావం కిరాణాషాపులపై అంతగా ఉండదని, మెట్రో సిటీల్లో ఇది చూశామని మరికొందరు వాదిస్తున్నారు. దీనిపై మీ COMMENT?
News February 9, 2026
US సైనిక మోహరింపులకు భయపడం: ఇరాన్

అమెరికాతో <<19053726>>చర్చల్లో<<>> యురేనియం శుద్ధి విషయంలో వెనక్కి తగ్గబోమని ఇరాన్ స్పష్టం చేసింది. ఈ విషయంలో తమను ఆదేశించే హక్కు ఎవరికీ లేదని తేల్చిచెప్పింది. <<19009250>>సైనిక మోహరింపు<<>>లతో అమెరికా తమను భయపెట్టలేదని విదేశాంగ మంత్రి అబ్బాస్ అరఘ్చీ అన్నారు. ‘మాకు USపై పెద్దగా నమ్మకం లేదు. ఆ దేశంతో చర్చల గురించి మా వ్యూహాత్మక భాగస్వాములైన చైనా, రష్యాతో సంప్రదింపులు జరుపుతున్నాం’ అని తెలిపారు.
News February 9, 2026
గొర్రెలను కొంటున్నారా? మంద వేగంగా అభివృద్ధి చెందాలంటే ఏం చేయాలి?

గొర్రెల పెంపకంలో ఆదాయం మంద అభివృద్ధిపైనే ఆధారపడి ఉంటుంది. దీని కోసం రైతులు మంద నుంచే గొర్రెలను కొనాలి. రెండు ఈతలకు మధ్య ఎక్కువ సమయం తీసుకునేవి వద్దు. చూడి, మొదటిసారి ఈనిన వాటిని కొంటే మంద పెరిగే ఛాన్సుంది. విత్తన పొట్టేలు రెండేళ్ల లోపు వయసుండి, ఆరోగ్యంగా, చురుకుగా, కవల పిల్లలను కనే వంశం నుంచి వచ్చినదై ఉండాలి. గొర్రెల మంద పెరగడానికి కీలక సూచనల కోసం <<-se_10015>>పాడిపంట క్లిక్ <<>>చేయండి.


