News October 14, 2025
ఈ నెలాఖరు నుంచి రాష్ట్రవ్యాప్తంగా కవిత యాత్ర

TG: జాగృతి చీఫ్ కవిత రాష్ట్రవ్యాప్తంగా యాత్ర చేపట్టాలని నిర్ణయించారు. అన్ని జిల్లాల మీదుగా సాగే ఈ యాత్రను ఈ నెలాఖరు నుంచి ప్రారంభిస్తానని తెలిపారు. ఇందులో భాగంగా విద్యావంతులు, మేధావులతో సమావేశాలు నిర్వహించనున్నారు. జాగృతి యూత్ ఫెడరేషన్ రాష్ట్ర, జిల్లాల నాయకులకు నియామక పత్రాలు అందజేసిన సందర్భంగా ఆమె మాట్లాడారు. షెడ్యూల్, సమావేశాల వివరాలతో రేపు యాత్ర పోస్టర్‌ను రిలీజ్ చేస్తారని సమాచారం.
Similar News
News October 14, 2025
జగన్ ఆస్తుల వివాదం.. స్టేటస్ కో విధించిన NCLT

YS జగన్‌కు చెందిన సరస్వతి సిమెంట్స్ షేర్ల బదిలీపై చెన్నైలోని NCLT అప్పిలేట్ ట్రిబ్యునల్ స్టేటస్ కో విధించింది. జులై 29న హైదరాబాద్ NCLT బెంచ్ జగన్‌కు అనుకూలంగా తీర్పునిచ్చింది. జగన్ తల్లి, చెల్లెలి పేరిట రాసిన గిఫ్ట్ డీడ్‌లో షేర్లు పూర్తిగా బదిలీ కాలేదని, అందువల్ల అవి జగన్ వద్దే ఉన్నట్లు తెలిపింది. ఈ తీర్పును సవాల్ చేస్తూ వైఎస్ విజయమ్మ చెన్నై బెంచ్‌లో అప్పీల్ చేయగా దానిపై స్టేటస్ కో విధించింది.
News October 14, 2025
సరైన నిద్ర లేకపోతే కంటి సమస్యలు!

కంటినిండా నిద్రలేకపోతే కళ్లపై ఎఫెక్ట్ పడుతుందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. గాఢనిద్రలో కళ్లు సహజంగా కన్నీళ్లను ఉత్పత్తి చేస్తాయని, దీనివల్ల అవి మృదువుగా ఉంటాయని అంటున్నారు. నిద్ర సరిగా లేకపోతే కళ్లు పొడిబారిపోతాయని చెబుతున్నారు. దీర్ఘకాలికంగా ఇదే కంటిన్యూ అయితే రెటీనా పనితీరు మందగించి చూపు తగ్గుతుందని వార్నింగ్ ఇస్తున్నారు. రోజుకు 6-8 గంటలు నిద్రపోవాలని సూచిస్తున్నారు.
Share it
News October 14, 2025
ఎంత సంపాదించినా డబ్బు మిగలట్లేదా?

చేతిలో ధనం నిలవనివారు 21 రోజుల సంకల్పాన్ని పాటించాలని పండితులు సూచిస్తున్నారు. ఫలితంగా లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటుందంటున్నారు. ‘రోజూ ఉదయం లక్ష్మీదేవిని ప్రార్థించి, కొంత డబ్బును హుండీలో వేయండి. అనవసర ఖర్చులు చేయకూడదనే నియమం పెట్టుకోండి. సాయంత్రం వచ్చాక, ఖర్చు చేయకుండా ఆపగలిగిన డబ్బును అందులో వేయండి. ఈ ఆచరణ 21 రోజులు పాటిస్తే దైవ కృపతో ఆర్థిక సుస్థిరత సాధిస్తారు’ అని అంటున్నారు. <<-se>>#DHARMASANDEHALU<<>>