News March 16, 2024
కవిత కేసు విచారణ వాయిదా

TG: MLC కవిత కేసు విచారణను రౌస్ అవెన్యూ కోర్టు మధ్యాహ్నం 2 గంటలకు వాయిదా వేసింది. ఆమెతో మాట్లాడేందుకు న్యాయవాదులకు జడ్జి అనుమతినిచ్చారు. దీంతో కోర్టు హాలులో ఆమెతో న్యాయవాదులు భేటీ అయ్యారు.
Similar News
News November 8, 2025
భారత్‌ని టార్గెట్ చేసిన పాక్ హ్యాకర్స్!

పాక్‌తో సంబంధమున్న ‘ట్రాన్స్‌పరెంట్ ట్రైబ్’ అనే హ్యాకర్స్ గ్రూప్ భారత్‌ని టార్గెట్ చేస్తున్నట్లు నిఘా వర్గాలు హెచ్చరించాయి. ‘డెస్క్ ర్యాట్’ అనే అడ్వాన్స్డ్ స్పై వేర్‌తో ప్రభుత్వం, ఆర్మీ కంప్యూటర్స్‌ని అటాక్ చేస్తున్నట్లు తెలిపాయి. భారత కంప్యూటర్ల ద్వారా చైనా మిలిటరీ కదలికలు చూసే ప్రయత్నం చేస్తున్నట్లు తెలిపాయి. నకిలీ ఈమెయిల్స్‌తో స్పైవేర్ ఇన్‌స్టాల్ చేసుకునేలా ట్రాప్ చేస్తున్నట్లు పేర్కొన్నాయి.
News November 8, 2025
లోన్లు తీసుకున్నవారికి HDFC శుభవార్త

మార్జినల్ కాస్ట్ ఆఫ్ ఫండ్స్-బేస్డ్ లెండింగ్ రేటు (MCLR)ను 10 బేసిస్ పాయింట్లు తగ్గిస్తున్నట్లు HDFC బ్యాంకు ప్రకటించింది. ఇదివరకు MCLR 8.45-8.65% మధ్య ఉండగా, ఇప్పుడు 8.35%-8.60%కి తగ్గింది. దీంతో ఒకరోజు, నెల, 3 నెలలు, 6 నెలలు, ఏడాది, మూడేళ్ల కాలపరిమితి కలిగిన రుణాలపై వడ్డీ రేట్లు తగ్గాయి. నవంబర్ 7 నుంచి కొత్త MCLR రేట్లు అమల్లోకి వచ్చినట్లు ఆ బ్యాంకు పేర్కొంది.
News November 8, 2025
ఫిట్‌నెస్‌కి సారా నియమాలు

ప్రస్తుతకాలంలో చాలామంది అమ్మాయిలు PCODతో బాధపడుతున్నారు. వారిలో హీరోయిన్ సారా అలీఖాన్ కూడా ఒకరు. మొదట్లో ఎంతో బరువున్న ఈమె కొన్ని నియమాలు పాటించి ఫిట్‌గా మారారు. సారా ఎక్కువగా లీన్ ప్రోటీన్లు, కూరగాయలు, పండ్లు, తృణధాన్యాలు ఎక్కువగా తీసుకున్నట్లు ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. క్రమం తప్పకుండా యోగా, వ్యాయామం, మెడిటేషన్ చేసేవారు. హైడ్రేటెడ్‌గా ఉండటంతో పాటు సరిపడానిద్ర వల్లే ఫిట్‌గా మారానని సారా అంటున్నారు.


