News March 18, 2024

రూ.100 కోట్ల ముడుపుల వ్యవహారంలో కవిత ప్రమేయం: ED

image

ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో కవిత అరెస్టుపై ఈడీ అధికారిక ప్రకటన చేసింది. ‘లిక్కర్ స్కాం కేసులో కవితను అరెస్టు చేశాం. కోర్టు అనుమతితో కస్టడీలోకి తీసుకుని విచారిస్తున్నాం. రూ.100 కోట్ల ముడుపుల వ్యవహారంలో కవిత ప్రమేయం ఉంది. ఆప్ నేతలకు వంద కోట్లు చేర్చారు. 240 చోట్ల సోదాలు చేశాం. రూ.128 కోట్ల ఆస్తులను జప్తు చేశాం. మనీశ్ సిసోడియా, సంజయ్ సింగ్, విజయ్ నాయర్‌లతో కవితకు సంబంధం ఉంది’ అని తెలిపింది.

Similar News

News July 5, 2025

సర్పంచి ఎన్నికలు అప్పుడేనా?

image

TG: BC రిజర్వేషన్లు ఖరారయ్యాకే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని కాంగ్రెస్ నేతలు ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి KC వేణుగోపాల్‌తో చెప్పినట్లు తెలుస్తోంది. నిన్న ఆయనతో జరిగిన భేటీలో స్థానిక ఎన్నికలు, BCలకు 42% రిజర్వేషన్లపై చర్చించారు. కులగణనపై ప్రజల్లో మంచి స్పందన వచ్చిందని వివరించారు. BCలకు 42% సీట్లు ఇచ్చి, బలహీన వర్గాలకు పార్టీ అండగా ఉంటుందనే సంకేతాన్ని ప్రజల్లోకి పంపాలని సూచించినట్లు సమాచారం.

News July 5, 2025

రైతులకు శుభవార్త.. ఆగస్టు నాటికి కొత్త పాస్ పుస్తకాలు

image

AP: రీసర్వే పూర్తైన గ్రామాల్లో ఆగస్టు నాటికి రైతులకు కొత్త పాస్ పుస్తకాలు అందించాలని సీఎం చంద్రబాబు అధికారులను ఆదేశించారు. ప్రతి పాస్‌బుక్‌పై QR కోడ్‌తో పాటు ఆధార్ ఆధారంగా తమ సొంత భూమి వివరాలు తెలుసుకునేలా చర్యలు సూచించారు. 2027 డిసెంబర్ నాటికి భూముల రీసర్వే పూర్తి చేయాలని సీఎం స్పష్టం చేశారు. అలాగే అక్టోబర్ నాటికి ప్రతి ఒక్కరికీ శాశ్వత కుల ధ్రువీకరణ పత్రాలు పంపిణీ చేయాలని సూచించారు.

News July 5, 2025

‘మహా’ రాజకీయాల్లో కీలక పరిణామం

image

మహారాష్ట్ర రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకోనుంది. రాజ్ ఠాక్రే, ఉద్ధవ్ ఠాక్రే సోదరులు మరాఠీ భాష కోసం ఒక్కటి కాబోతున్నారు. కేంద్రం తీసుకొచ్చిన 3 లాంగ్వేజ్ ఫార్ములాను వ్యతిరేకిస్తూ MH నవనిర్మాణ సేన చీఫ్ రాజ్, శివసేన(UBT) అధినేత ఉద్ధవ్ ఇవాళ సంయుక్తంగా మెగా ర్యాలీ చేపట్టనున్నారు. 2 దశాబ్దాల తర్వాత వీరు కలుస్తుండటంతో రాష్ట్రంలో కొత్త రాజకీయ పొత్తు ఉదయిస్తుందా అన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.