News September 2, 2025

కవిత కొత్త పార్టీ.. రిజిస్ట్రేషన్ కంప్లీట్?

image

TG: BRS MLC కవిత కొత్త పార్టీ పెట్టబోతున్నారంటూ వార్తలు వస్తున్నాయి. ఇందుకు సంబంధించి రిజిస్ట్రేషన్ కూడా పూర్తైనట్లు ప్రచారం జరుగుతోంది. బీఆర్ఎస్ నుంచి సస్పెన్షన్ ఆర్డర్స్ వచ్చాక ఆమె కొత్త పార్టీ పేరు ప్రకటించే అవకాశమున్నట్లు సమాచారం. మరోవైపు నేడో రేపో BRS నుంచి కవితను సస్పెండ్ చేస్తారని వార్తలు వస్తున్నాయి. ఎర్రవల్లి ఫామ్ హౌస్‌లో దీనిపైనే ప్రధాన చర్చ జరుగుతున్నట్లు రాజకీయ వర్గాల సమాచారం.

Similar News

News September 4, 2025

ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్ అర్మానీ కన్నుమూత

image

ప్రపంచ ప్రఖ్యాత, ఇటలీ లెజెండరీ ఫ్యాషన్ డిజైనర్ అర్మానీ(91) కన్నుమూశారు. వయో సంబంధిత సమస్యలతో ఆయన చనిపోయినట్లు ఫ్యాషన్ హౌస్ కంపెనీ తెలిపింది. కింగ్ జార్జియోగా పేరొందిన అర్మానీ మోడర్న్ ఇటాలియన్ స్టైల్‌తో పేరొందారు. ఆయన కంపెనీ ఏటా 2.3 బిలియన్ యూరోల ఆదాయం ఆర్జిస్తోంది. అర్మానీ అంత్యక్రియలు ఈ నెల 6 లేదా 7న నిర్వహించనున్నట్లు కంపెనీ పేర్కొంది. అర్మానీ బ్రాండ్ వస్త్ర ప్రపంచంలోనే ప్రసిద్ధి గాంచింది.

News September 4, 2025

జాగృతిలో చీలికలు.. BRS కోసమే పనిచేస్తామంటున్న నేతలు

image

TG: బీఆర్ఎస్‌ను కవిత వీడటంతో దాని అనుబంధ సంస్థగా ఉన్న జాగృతిలో చీలికలు బయటపడుతున్నాయి. కవిత తమను నడిరోడ్డుపై పడేసిందని జాగృతి నేత రాజీవ్ సాగర్ ఆరోపించారు. బీఆర్ఎస్ కోసం పనిచేసే తెలంగాణ జాగృతి తమదేనని, కేసీఆర్ చెప్పిందే చేస్తామని చెప్పారు. తెలంగాణ జాగృతి బోర్డు పెట్టుకునే హక్కు తమకు ఉందన్నారు. దీనిపై జాగృతి ఫౌండర్ కవిత స్పందించాల్సి ఉంది.

News September 4, 2025

చైనా హ్యాకర్ల చేతిలో అమెరికన్ల డేటా!

image

అమెరికాను ‘సాల్ట్ టైఫూన్’ అనే పేరు భయపెడుతోంది. చైనాకు చెందిన ఈ సైబర్ ముఠా అమెరికాలోని ప్రతి పౌరుడి డేటాను హ్యాక్ చేసిందని సెక్యూరిటీ నిపుణులు భయపడుతున్నారు. ఈ ముఠా 2019 నుంచి 80 దేశాల్లో 200 కంపెనీలను లక్ష్యంగా చేసుకుందని చెబుతున్నారు. ఈ భారీ ఎటాక్ చైనా హ్యాకింగ్ సామర్థ్యాలను తెలియజేస్తోందని NYT కథనం పేర్కొంది. చైనా ప్రభుత్వమే వీరికి నిధులు ఇస్తుందని ఆరోపించింది.