News March 19, 2024
ఈడీ కస్టడీ నుంచి విడుదల చేయాలని కవిత రిట్ పిటిషన్

ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో అరెస్టైన ఎమ్మెల్సీ కవిత సుప్రీంకోర్టులో రిట్ పిటిషన్ వేశారు. ఈడీ కస్టడీ నుంచి తనను విడుదల చేసేలా ఆదేశాలు ఇవ్వాలని ఆమె అందులో కోరారు. కాగా ఇటీవల కవితను ఈడీ అరెస్ట్ చేయగా.. రౌస్ అవెన్యూ కోర్టు ఆమెకు ఈనెల 23 వరకు కస్టడీ విధించింది.
Similar News
News April 22, 2025
48 గంటల్లో రైతుల ఖాతాల్లో డబ్బులు: ఉత్తమ్

TG: రబీ సీజన్లో ధాన్యం దిగుబడికి అనుగుణంగా గన్నీ సంచులను అందుబాటులో ఉంచామని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. ధాన్యం కొనుగోలు చేసిన 48 గంటల్లోనే రైతుల ఖాతాల్లో నగదు జమ చేస్తున్నామన్నారు. రైతు మహోత్సవంలో ఆయన మాట్లాడారు. పంట చివరి గింజ వరకు కొనుగోలు చేసేందుకు ప్రభుత్వం ప్రణాళికలు చేసిందని తెలిపారు. గత ప్రభుత్వం నీటి పారుదల రంగంపై రూ.81వేల కోట్లు వెచ్చించినా ఏమీ సాధించలేదని దుయ్యబట్టారు.
News April 22, 2025
అద్భుతం.. 10Gbps వేగంతో డౌన్లోడ్

చైనా మరో అద్భుతం చేసింది. ప్రపంచంలోనే మొట్టమొదటగా 10Gbps వేగంతో పనిచేసే 10G బ్రాడ్‌బ్యాండ్ నెట్‌వర్క్‌ను ప్రారంభించింది. బీజింగ్ సమీపంలోని హెబీ ప్రావిన్స్‌లో టెస్టు చేయగా 9834 Mbps గరిష్ఠ వేగంతో ఇంటర్నెట్ పని చేసినట్లు చైనీస్ మీడియా వెల్లడించింది. ఈ వేగంతో రెండు ఫుల్ 4k క్వాలిటీ సినిమాలను ఒక్క సెకన్లోనే డౌన్లోడ్ చేసుకోవచ్చు. క్లౌడ్ కంప్యూటింగ్, టెలీ మెడిసిన్ రంగాలకు ఇది ఎంతో మేలు చేయనుంది.
News April 21, 2025
ఆ చైనా యాప్ తీసేయండి.. గూగుల్‌కు భారత్ సూచన

చైనాకు చెందిన వీడియో చాటింగ్ యాప్ ‘యాబ్లో’(Ablo)ను ప్లే స్టోర్ నుంచి తొలగించాలని గూగుల్‌కు భారత ప్రభుత్వం సూచించింది. అందులో భారత భూభాగాల్ని తప్పుగా చూపించడమే దీనికి కారణం. జమ్మూకశ్మీర్, లద్దాక్‌ను భారత భూభాగాలుగా చూపించని ఆ యాప్, లక్షద్వీప్‌ను మొత్తానికే మ్యాప్ నుంచి తొలగించింది. ఈ నేపథ్యంలోనే భారత సార్వభౌమత్వాన్ని గౌరవించని ఆ యాప్‌ను తొలగించాలని గూగుల్‌కు భారత్ తేల్చిచెప్పింది.