News October 25, 2024

వచ్చే ఏడాదికి కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ సిద్ధం: కిషన్ రెడ్డి

image

TG: కాజీపేటలో రైల్ మాన్యుఫాక్చరింగ్ యూనిట్‌ను ఏటా 600 కోచ్‌లు రూపొందించేలా సిద్ధం చేయనున్నారు. ఇక్కడే గూడ్స్ వ్యాగన్లు, ఇంజిన్లు, రైల్వే కోచ్‌లు తయారవుతాయి. ఆధునిక LHB కోచ్‌లు, సబర్బన్ రైళ్లకు ఉపయోగించే EMU(ఎలక్ట్రిక్ మల్టిపుల్ యూనిట్లు)లు ఇక్కడే రూపొందిస్తారు. 3వేల మందికి ఉపాధి లభించనుంది. ₹680 కోట్లతో దీనిని చేపడుతున్నామని, 2025 ఆగస్టులోగా పూర్తి చేస్తామని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి వెల్లడించారు.

Similar News

News October 25, 2024

ఇండియాలో ఏ భాష వినియోగం ఎక్కువ?

image

దేశంలోని చాలా రాష్ట్రాల్లో హిందీ భాష వినియోగంలో ఉంది. ఓ నివేదిక ప్రకారం దాదాపు 52.82 కోట్ల మంది హిందీ మాట్లాడతారు. బెంగాలీని 9.72కోట్ల మంది మాట్లాడితే 8.30 కోట్ల మంది మరాఠీలో సంభాషిస్తారు. ఇక 8.11 కోట్ల మంది తెలుగు, 6.90 కోట్ల మంది తమిళం మాట్లాడుతున్నారు. 5.54 కోట్ల మంది గుజరాతీ, 5.07 కోట్ల మంది ఉర్దూ, కన్నడ భాషను 4.37 కోట్లు, 3.75 కోట్ల మంది ఒడియా, మలయాళం మాట్లాడేవారు 3.48 కోట్ల మంది ఉన్నారు.

News October 25, 2024

నేటి నుంచి మంత్రి లోకేశ్ అమెరికా పర్యటన

image

AP: ఇవాళ్టి నుంచి నవంబర్ 1 వరకు మంత్రి లోకేశ్ అమెరికాలో పర్యటించనున్నారు. పర్యటనలో భాగంగా జార్జియా ఐటీ సర్వ్ సినర్జీ సదస్సులో ఆయన ప్రసంగిస్తారు. పలు కంపెనీల ప్రతినిధులతో సమావేశమై రాష్ట్రంలో పెట్టుబడులపై చర్చిస్తారు. శాన్‌ఫ్రాన్సిస్కోలో రేపు ఒరాకిల్ ప్రతినిధులు, పారిశ్రామికవేత్తలతో భేటీ కానున్నారు.

News October 25, 2024

హైడ్రాకు 100 రోజులు.. BRS విమర్శలు

image

TG: ‘హైడ్రా’కు 100 రోజులు పూర్తవడంతో ప్రభుత్వంపై BRS విమర్శలు గుప్పించింది. ‘రేవంత్ సర్కార్ హైడ్రా పేరుతో పేదల జీవితాలను రోడ్డుకీడ్చింది. వెయ్యెలుకలు తిన్న పిల్లి తీర్థయాత్రలు చేసినట్టు కబ్జాలు ప్రోత్సహించిన కాంగ్రెస్ పరిరక్షణ పేరుతో డ్రామాలాడుతోంది. పేదలకు నోటీసులు ఇవ్వకుండా కూలగొట్టేందుకు మనసెలా వచ్చింది? అనుముల తిరుపతి‌రెడ్డి ఇంటి ఒక్క ఇటుకనైనా ఎందుకు ముట్టలేకపోయింది?’ అని ప్రశ్నించింది.