News March 12, 2025

మారనున్న KBC హోస్ట్‌!

image

‘కౌన్ బనేగా కరోడ్‌పతి’ హోస్ట్‌గా చేస్తోన్న బిగ్ బీ అమితాబ్ బచ్చన్ నెక్స్ట్ సీజన్ నుంచి వైదొలిగే అవకాశం ఉందని సినీవర్గాలు తెలిపాయి. దీంతో తర్వాతి హోస్ట్ ఎవరనే చర్చ మొదలైంది. ఆయన స్థానంలో బాలీవుడ్ నటీనటులు షారుఖ్ ఖాన్, ఐశ్వర్య రాయ్, మాజీ క్రికెటర్ మహేంద్ర సింగ్ ధోనీలలో ఒకరిని నియమిస్తారని సమాచారం. 2007 KBCలో షారుఖ్ హోస్ట్‌గా చేసిన విషయం తెలిసిందే. ఎవరిని నియమిస్తే బాగుంటుందో కామెంట్ చేయండి.

Similar News

News November 15, 2025

స్వామి పుష్కరిణి అని పేరెందుకు వచ్చింది?

image

తిరుమలలోని స్వామి పుష్కరిణికి ఆ పేరు రావడానికి ఓ పురాణ కథనం ప్రాచుర్యంలో ఉంది. వేంకటాచలంలో ఉన్న మూడు కోట్ల తీర్థాలన్నింటికీ ఈ పుష్కరిణియే అవతార స్థానం. లోకంలోని తీర్థాలన్నింటిలోనూ దీన్ని స్వామి వంటిదిగా పరిగణిస్తారు. వరాహ, వామన పురాణాల ప్రకారం.. తనలో స్నానం చేసిన వారికి రాజ్యాధికారాన్ని ప్రసాదించగల శక్తి, పవిత్రతను అందిస్తుందట. అందుకే దీనికి స్వామి పుష్కరిణి అనే పేరు స్థిరపడింది. <<-se>>#VINAROBHAGYAMU<<>>

News November 15, 2025

APPLY NOW: CWCలో 22 పోస్టులు

image

సెంట్రల్ వేర్‌హౌసింగ్ కార్పొరేషన్‌(CWC)లో 22 పోస్టులకు అప్లై చేయడానికి ఇవాళే ఆఖరు తేదీ. అర్హతగల అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. వయసు 18 నుంచి 28 ఏళ్ల మధ్య ఉండాలి. రిజర్వేషన్ గలవారికి ఏజ్‌లో సడలింపు ఉంది. రాత పరీక్ష, స్కిల్ టెస్ట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఆధారంగా ఎంపిక చేస్తారు. వెబ్‌సైట్: https://cwceportal.com/

News November 15, 2025

ఆర్జేడీ భంగపాటుకు ప్రధాన కారణం కాంగ్రెస్ బలహీనతే!

image

బలహీనంగా ఉన్న కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకోవడమే బిహార్‌లో ఆర్జేడీ ఓటమికి కారణమని విశ్లేషకులు భావిస్తున్నారు. స్థానిక సమస్యలను పక్కనపెట్టి ఓట్ చోరీ ఆరోపణలపై ఎక్కువగా దృష్టిపెట్టడం కూడా మహాగఠ్‌బంధన్ కొంపముంచిందని చెబుతున్నారు. బలహీన కాంగ్రెస్ ఆర్జేడీకి భారమైందని, సంప్రదాయ ఓటు బ్యాంకును నమ్ముకోవడమూ ఓటమికి కారణమని అంటున్నారు. గత ఎన్నికల్లో సింగిల్ లార్జెస్ట్ పార్టీ ఇప్పుడు మూడో స్థానానికి పడిపోయింది.