News November 12, 2024
KC కెనాల్ గురించి తెలుసా?
KC కెనాల్ (కర్నూలు-కడప కాలువ) రాయలసీమలోని ఒక ప్రధాన పంట కాలువ. 1950లో నిర్మితమైంది. ఇది పెన్నా, తుంగభద్ర నదులను అనుసంధానిస్తుంది. ఈ కాలువ కర్నూలు సమీపంలోని తుంగభద్ర నదిపై ఉన్న సుంకేసుల బ్యారేజీ నుంచి ప్రారంభమవుతుంది. ఈ కెనాల్ పొడవు 305.60 కి.మీ కాగా దీని కింద 2,65,628 ఎకరాల ఆయకట్టు భూమి ఉంది. ఇది కర్నూలు, కడప జిల్లాల రైతులకు ప్రాణప్రదమైన కాలువ.
Similar News
News December 6, 2024
ప్రధానితో భేటీ అద్భుతమైన అనుభవం: మంత్రి భరత్
ప్రధాని మోదీని మంత్రి టీజీ భరత్ మర్యాదపూర్వకంగా కలిశారు. ఢిల్లీలో కలిసి పలు అంశాలపై ఆయనకు వినతి పత్రం అందజేశారు. ‘ప్రధాని మోదీని కలవడం గౌరవంగా భావిస్తున్నా. గతంలో ఒక కమిటీకి ఛైర్మన్‌గా మా నాన్న టీజీ వెంకటేశ్ చేసిన కృషిని ఆయన గుర్తు చేసుకోవడం నాకు ఆనందాన్ని ఇచ్చింది. పీఎంను కలిసి చర్చించే అవకాశం రావడం నాకు నిజంగానే ఒక అద్భుతమైన అనుభవం’ అని మంత్రి ట్వీట్ చేశారు.
News December 6, 2024
హోంగార్డులు పోలీసు వ్యవస్థలో కీలకం: ఎస్పీ
జిల్లా పోలీస్ మైదానంలో 62వ హోంగార్డుల వ్యవస్థాపక దినోత్సవం జిల్లా ఎస్పీ బిందు మాధవ్, హోంగార్డ్ కమాండెంట్ ఎం.మహేశ్ కుమార్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఎస్పీ మాట్లాడుతూ.. పోలీసులతో సమానంగా హోంగార్డులు శాంతిభద్రత పర్యవేక్షణలో మంచి సేవలు అందిస్తున్నారని తెలిపారు. హోంగార్డుల సమస్యల పట్ల పోలీసు యంత్రాంగం తరఫున తన వంతు కృషి చేస్తానన్నారు.
News December 6, 2024
‘మరోసారి ఆడపిల్ల పుడుతుందేమోనని భార్యను, కూతురిని చంపేశాడు’
హోళగుంద మం. హెబ్బటంలో తల్లీ, కూతురు <<14801963>>మృతిచెందిన<<>> విషయం తెలిసిందే. సకరప్ప, సలీమా(21)కు పెళ్లైన ఏడాదికి పుట్టిన ఆడబిడ్డ 40రోజులకు చనిపోయింది. తర్వాత సమీరా(3)కు జన్మనిచ్చింది. ప్రస్తుతం గర్భిణి. అయితే మరోసారి ఆడపిల్లే పుడుతుందేమోనని భర్త రోజూ గొడపపడేవాడు. గురువారమూ వీరి మధ్య గొడవజరిగి, ఆవేశంతో కర్రతో సలీమా తలపై కొట్టి చంపాడు. అదంతా పాప చూడటంతో చిన్నారిని కూడా గొంతు నులిమి చంపి పోలీసులకు లొంగిపోయాడు.