News April 27, 2024
KCRపై పంజాగుట్ట PSలో ఫిర్యాదు

మాజీ CM KCRపై సీనియర్ న్యాయవాది అరుణ్ కుమార్ శనివారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇటీవల ఓ ఛానల్ ఇంటర్వ్యూలో ఆయన చేసిన వ్యాఖ్యలను సుమోటోగా తీసుకొని కేసు నమోదు చేయాలని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో KCRతో పాటు అప్పటి కేబినెట్‌లోని 39 మంది MLAలపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలన్నారు.
Similar News
News April 12, 2026
ఇంటర్ 2nd ఇయర్‌లో HYD-2లో ఇదీ పరిస్థితి!

ఇంటర్ 2nd ఇయర్ ఫలితాలు విడుదలయ్యాయి. <<19630797>>HYD<<>>-2లో రెగ్యులర్ విద్యార్థులు 34443 మంది పరీక్షలు రాయగా 24219 మంది పాసై 70.32 శాతంతో స్టేట్‌లో 22వ ర్యాంక్ వచ్చింది. రెగ్యులర్ ఒకేషనల్‌లో 1868 మందికి 1402 మంది పాసై 75.05%తో 14వ స్థానంలో నిలవగా రెగ్యులర్ ప్రైవేట్‌లో 7371 మందికి 1718 మంది పాసై 23.31%తో 35వ స్థానంలో నిలిచింది. ఒకేషనల్ ప్రైవేట్‌లో 165 మందికి 74 మంది పాసై 44.85%తో 17వ ప్లేస్ వచ్చింది.
News April 12, 2026
ఇంటర్ సెకండియర్‌లో HYD-1కు 11TH ర్యాంక్

ఇంటర్ సెకండియర్ ఫలితాలు విడుదలయ్యాయి. HYD- 1లో రెగ్యులర్ విద్యార్థులు 28,930 మంది పరీక్షలు రాయగా 21,529 మంది పాసై 74.42 శాతంతో స్టేట్‌లోనే 11TH ర్యాంక్ వచ్చింది. రెగ్యులర్ వొకేషనల్‌లో 1,298 మందికి 1,007 మంది పాసై 77.58%తో 9వ స్థానంలో నిలవగా రెగ్యులర్ ప్రైవేట్‌లో 5,194 మందికి 1,302 మంది పాసై 25.07%తో 33వ స్థానంలో నిలిచింది. వొకేషనల్ ప్రైవేట్‌లో 91 మందికి 44 మంది పాసై 48.35%తో 22వ ప్లేస్ వచ్చింది.
News April 12, 2026
ఇంటర్ 1st ఇయర్.. HYDలో ఇదీ పరిస్థితి..!

HYDలో జిల్లాను ఇంటర్‌లో 3భాగాలుగా విభజించారు. HYD-1లో రెగ్యులర్ 1st ఇయర్ విద్యార్థులు 29660 మందికి 19933 మంది పాసవ్వగా 67.20%తో 8వ ర్యాంక్ కొట్టింది. HYD-2లో 36997మందికి 23001 పాసవ్వగా 62.17%తో 17వ స్థానంలో, HYD-3లో 11773 మందికి 7698 మంది పాసవ్వడంతో 65.39%తో 10వ స్థానంలో నిలిచింది.
☛ VOCలో HYD-1: 1357మందిలో 899 మంది పాసై 66.25%
☛ HYD-2 2043కి 1279 మంది 62.60%
☛ HYD-3 677కి 436 మంది పాసై 64.40%


