News January 30, 2026
KCRకు మరోసారి నోటీసులు!

TG: ఫోన్ ట్యాపింగ్ కేసులో BRS అధినేత KCRకు ఇవాళ సిట్ <<18998286>>మరోసారి<<>> నోటీసులు ఇవ్వనుంది. రేపు విచారణకు రావాలని అందులో పేర్కొననున్నట్లు తెలుస్తోంది. అయితే నందినగర్‌లోని ఇంట్లో నోటీసులు ఇస్తారా? ఎర్రవల్లిలోని ఫామ్ హౌస్‌లో అందిస్తారా అనే దానిపై క్లారిటీ రావాల్సి ఉంది. నిన్న నందినగర్ నివాసంలో సిట్ నోటీసులిచ్చి విచారణకు రావాలని కోరగా, KCR అభ్యర్థన మేరకు నేడు మినహాయింపు ఇచ్చారు.
Similar News
News February 11, 2026
మున్సిపల్ ఎన్నికల పోలింగ్ ఎంతంటే?

తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల ఓటింగ్ ప్రక్రియ పూర్తయింది. ఓవరాల్‌గా 73.01శాతం పోలింగ్ నమోదైంది. కార్పొరేషన్లలో 66.05శాతం, మున్సిపాలిటీల్లో 75.88శాతం ఓటింగ్ నమోదైనట్లు అధికారులు తెలిపారు. సాయంత్రం 5 గంటలకే పోలింగ్ ముగిసినా క్యూ లైన్లలో ఉన్నవారికి ఓటు వేసే అవకాశం కల్పించి తాజాగా పూర్తి డేటాను వెల్లడించారు. ఎల్లుండి ఉదయం 8 గంటల నుంచి ఓట్ల లెక్కింపు ప్రారంభం అవుతుంది.
News February 11, 2026
T20WC: ఒకే ఓవర్లో 6, 4, 4, 0, 6, 4

వెస్టిండీస్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో ఇంగ్లండ్ ఓపెనర్ ఫిల్ సాల్ట్ ఆకాశమే హద్దుగా చెలరేగారు. హోల్డర్ వేసిన ఇన్నింగ్స్ రెండో ఓవర్లో ఏకంగా 24 రన్స్ రాబట్టారు. బాల్ బై బాల్ రన్స్ చూస్తే 6, 4, 4, 0, 6, 4. ఆపై షఫర్డ్ బౌలింగ్‌లో 30 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద ఔటై పెవిలియన్‌కు చేరారు. తొలుత బ్యాటింగ్ చేసిన WI 6 వికెట్ల నష్టానికి 196 పరుగులు చేసిన విషయం తెలిసిందే.
News February 11, 2026
VIRAL: రైలులో గణేశుడి ఆలయం.. తెలుసా?

బిహార్‌లోని జయనగర్ నుంచి అమృత్‌సర్ వెళ్లే భారత్ గౌరవ్ టూరిస్ట్ రైలులో ఒక అరుదైన దృశ్యం కనిపిస్తుంది. ఇందులోని S-1 కోచ్‌లో 37వ నంబర్ బెర్త్‌ను గణేశుడికి కేటాయించారు. అక్కడ ఒక చిన్న ఆలయాన్ని ఏర్పాటు చేసి విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. గత 12 ఏళ్లుగా ప్రయాణికులు ఎవరూ ఈ బెర్త్‌ను బుక్ చేసుకోకుండా దేవుడికే వదిలేస్తున్నారు. ప్రయాణం సురక్షితంగా సాగాలని కోరుకుంటూ భక్తులు ఇక్కడ మొక్కులు చెల్లించుకోవడం విశేషం.


